Begin typing your search above and press return to search.
#సెలబ్ విడాకులు.. ముక్కలైన మనసులు కలవడమెలా?
By: Tupaki Desk | 28 Feb 2020 10:15 AM ISTబాలీవుడ్ లో ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోవడం చాలా సహజం. ఒకరినొకరు పూర్తిగా అర్ధం చేసుకుని పెళ్లి చేసుకున్నా! ఆ కాపురాలు మూడునాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. ఆ బంధం వీగిపోవడానికి కారణాలు అనేకం కావొచ్చు. కానీ భారతీయ సంస్కృతి మాత్రం పాశ్చాత్య ధోరణి కారణంగానే మంట గలుస్తోంది అన్నది అసలు వాస్తవం. చాలా అరుదుగా కొన్ని జంటలు మాత్రమే వైవాహిక బంధం దృష్ట్యా ఆదర్శంగా నిలుస్తున్నాయి. తాజాగా మరో బాలీవుడ్ జంట విడాకులకు దరఖాస్తు చేసుకుంది. విడాకులతో స్వేచ్ఛగా సభ్యసమాజానికి బధులివ్వాల్సిన అవసరం లేదని ప్రూవ్ చేయబోతున్నారు.
వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ నటుడు రణ్ వీర్ షోరే-నటి కొంకణ సేన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2010లో ఈ జంట వివాహం జరిగింది. తాజాగా పదేళ్ల దాంపత్య జీవితానికి పుల్ స్టాప్ పెట్టేస్తున్నారు. పెళ్లి అనంతరం ఐదేళ్ల పాటు కలిసి కాపురం చేసిన జంట ఆ తర్వాత వీడిపోయి ఎవరికి వారు వేరు కుంపటి పెట్టుకున్నారు. ఆ ప్రేమకు గుర్తుగా ఆరేళ్ల బాలుడు హరూన్ ఉన్నాడు. అయితే హరూని అదృష్టవశాత్తూ తల్లిదండ్రుల ప్రేమకు మాత్రం దూరం కాలేదు. బిడ్డ జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ఇద్దరూ ఒకరినొకరు కలుసుకునే వారు. ఈక్రమంలో మళ్లీ కలిసే ప్రయత్నం లో భాగంగా కొన్ని కౌన్సింగ్ సెషన్స్ కి ఎటెండయ్యారు.
అయినా బంధం బలపడలేదు. ఈగోల్ని పక్కన పెట్టేయలేదు. పగిలిన మనసులు కలవాడనికి ఒప్పుకోలేదు. దీంతో అధికారికం గా ఇరువురు విడిపోవడానికి విడాకులకు దరఖాస్తు చేసారు. ఇప్పటికే ఆ ప్రక్రియ కూడా పూర్తయింది. మరో ఆరు నెలల్లో కోర్టు నుంచి అధికారికం గా విడాకులు మంజూరు కానుందని సమాచారం. ఈ విషయం పై ఇరు కుటుంబ సభ్యులు చొరవగా చర్చలు జరిపినా విఫలమయ్యాయి.