Begin typing your search above and press return to search.

'మెగా' కోడలు చెప్పిన పాలపిట్ట కథ ఇదే!

By:  Tupaki Desk   |   3 Feb 2020 10:25 AM GMT
మెగా కోడలు చెప్పిన పాలపిట్ట కథ ఇదే!
X
మెగా స్టార్ చిరంజీవి కోడలుగా - మెగా పవర్ స్టార్ రాంచరణ్ సతీమణిగా ఉపాసనకు ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనవరసరం లేదు. అయితే, ఈ గుర్తింపుతో పాటు తనకంటూ ఓ ఐడెంటిటీని సంపాదించుకున్న ఉపాసన...సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే `మెగా` కోడలు కొంతకాలంగా పక్షుల సంరక్షణపై ఫోకస్ పెట్టింది. ఇటీవల రామ చిలుక వంటి పక్షులను సంరక్షించాలని ఉపాసన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. రామచిలుకను బంధించడం నేరమని ఇందుకు ఆరేళ్ల జైలు శిక్ష పడుతుందని ఉపాసన చేసిన ట్వీట్ నెట్టింట్ లో హల్ చల్ చేసింది. ఇపుడు తాజాగా, పాలపిట్టల ప్రాముఖ్యతను వివరిస్తూ ఉపాసన పెట్టిన ఫొటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపక్షి రామచిలుక విశిష్టతను వివరించిన ఉపాసన....తాజాగ తెలంగాణ రాష్ట్రపక్షి పాలపిట్టపై ఫోకస్ పెట్టింది. పాలపిట్ట గురించి అనేక ఆసక్తికర అంశాలను నెటిజన్లకు చెప్పింది ఉపాసన. పాలపిట్టను ఇంగ్లీషులో 'ఇండియన్ రోలర్ బర్డ్' అని, దీని శాస్త్రీయనామం కొరాసియస్ బెంగాలెన్సిస్ అని ఉపాసన చెప్పింది. దీనికున్న నీలి వర్ణం కారణంగా హిందీలో పాలపిట్టను 'నీల్ కాంత్' అంటారని, దసరా వంటి పండుగ సమయాల్లో పాలపిట్టను చూడడం, పూజించడాన్ని పవిత్రంగా భావిస్తారని చెప్పింది. ఈ కారణంతోనే పాలపిట్టలను పట్టుకోవడం, బంధించడం వంటివి చేస్తున్నారని, అందుకే పెద్ద సంఖ్యలో పాలపిట్టలు చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.