Begin typing your search above and press return to search.

మెగా కోడలి మెగా ఛాలెంజ్...!

By:  Tupaki Desk   |   19 April 2020 6:05 AM GMT
మెగా కోడలి మెగా ఛాలెంజ్...!
X
మెగా ఫ్యామిలీ కోడలిగా అడుగు పెట్టిన ఉపాసన.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం కలదని చాలాసార్లు నిరూపించుకుంది. ఉపాసన సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఎప్పుడూ ముందే ఉంటుంది. ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ ఉపయోగపడే పలు విషయాల గురించి వీడియోలు పోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హెల్త్, హైజీన్ విషయంలో ఉపాసన నెటిజన్స్‌కు అనేక సలహాలు సూచనలు చేస్తుంటోంది. అప్పుడప్పుడు వ్యాయామాల గురించి చెబుతుంది. అప్పుడప్పుడు మంచి వంటల గురించి టిప్స్ కూడా అందిస్తూ ఉంటుంది. తాజాగా కరోనా వైరస్ విషయంలో కూడా ఉపాసన ముందుంది. పేదవారికి తోచిన సాయం చేయడమే కాక కరోనా నేపధ్యంలో అనేక సలహాలు కూడా ఇస్తోంది. ఇక ఈ సమయంలో మెగా కోడలు ఉపాసన కొత్త ఛాలెంజ్ విసిరింది.

మన దేశంలో ఎక్కువగా వెస్ట్రెన్ టాయిలెట్స్ ని వాడుతున్నారని.. దాని వల్ల మనకు కొంత శారీరక సమస్యలు వస్తున్నాయని, అదే కనుక పాత పద్దతిలో ఉండే టాయిలెట్ ని వాడడం మంచిదని అవగాహన కలిగించడానికి ట్రై చేస్తోంది ఉపాసన. మోకాళ్ల మీద కూర్చుని ఉన్న ఫొటోని జోడించి ఇలా కూర్చోవడం చూసే వారికి చాలా ఈజీగా కనిపిస్తుంది కానీ అలా కూర్చోవడం చాలా కష్టం.. సిటీలలో చాలా మంది ఇలా కూర్చోవడానికి కష్ట పడతారని ఆమె పేర్కొంది. అలా ఇండియన్ టాయిలెట్ పొజిషన్ లో మీరు కనీసం 5 నిమిషాలైనా కూర్చోగలరా.. అని నెటిజన్లను ప్రశ్నించారు. నిజానికి ఇలా కూర్చోవటం వల్ల ఆరోగ్యకరైన ప్రయోజనాలు కూడా ఉంటాయని తెలిపారు. ఇది కూడా ఒకరమైన వ్యాయామమేనని.. మే 3 తర్వాత ప్రతిరోజూ తాను కూడా ఇలాంటి వ్యామాయం చేసేందుకు ప్రయత్నిస్తానని ఆమె పేర్కోన్నారు.

అయితే ఉపాసన పెట్టిన ఆ పోస్ట్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ రోజుల్లో అటువంటివి మాట్లాడడం అంటేనే ఇష్టపడని ఎందరో ఉన్న ఈ సమాజంలో.. మీరు ఎంతో ఉన్నత హోదాలో ఉన్నప్పటికీ ఏ మాత్రం బిడియం లేకుండా ఈ విధంగా మీవంతుగా సమాజానికి మెసేజ్ ఇస్తున్న మీరు గ్రేట్ అంటూ పొగుడుతున్నారు. ఒకరిద్దరు మెగా ఫ్యాన్స్ మాత్రం మెగా ఫ్యామిలీ కోడలు ఇలా సోషల్ మీడియా వేదికగా చేయడం ఏంటని ప్రశ్నించగా.. ఎక్కువ శాతం మంది ఉపాసన డేరింగ్ స్టెప్ ని మెచ్చుకుంటున్నారు. నిజానికి ఇది వినడానికి చూడడానికి ఎబ్బెట్టుగా ఉన్నా ఆమె చెప్పింది నిజమే. ఎందుకంటే ఒకప్పుడు మన పూర్వీకులు మల విసర్జన కోసం ఒక పద్దతిని శాస్త్రీయ పద్దతుల్లో కనిపెట్టారు. కానీ మనం ఏమో వెస్ట్రన్ కల్చర్ కి అలవాటయ్యి దీనిని పూర్తిగా మర్చిపోతున్నాం.. కనీసం ఇలా అయినా కొంచెం సేపు కూర్చుని ఉండగలిగితే వ్యాయామం చేసినట్టు ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.