Begin typing your search above and press return to search.

మెగా డాటర్ డ్యాన్సర్ పాత్రలో

By:  Tupaki Desk   |   12 Sep 2018 6:21 AM GMT
మెగా డాటర్ డ్యాన్సర్ పాత్రలో
X
మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మొదటి హీరోయిన్ నిహారిక కొణిదెల. యాక్టింగ్ టాలెంట్ విషయం పెద్దగా విమర్శలు లేవు గానీ ఇప్పటివరకైతే ఆమెతో విజయం దోబూచులాడుతూనే ఉంది. రెండు తెలుగు సినిమాలు ఒక తమిళ ఫిలింలో నటించిన నిహారిక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రంలో ఒక చిన్న పాత్రలో నటించే అవకాశం వచ్చింది. తాజాగా నిహారిక పాత్ర వివరాలు బయటకు వచ్చాయి.

'సైరా' లో నిహారిక ఒక కథకళి డ్యాన్సర్ పాత్రలో కనిపిస్తుందట. ఈ పాత్రను సమర్థవంతంగా పోషించేందుకు ఇప్పుడు కథకళి ట్రైనింగ్ తీసుకుంటోందట. సినిమాలో నిహారిక స్క్రీన్ టైమ్ పది నిముషాలే కానీ కథలో మాత్రం నిహారిక పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. ఒకవేళ ఈ పాత్రలో నిహారిక ప్రేక్షకులను మెప్పించగలిగితే తనకు మంచి బ్రేక్ రావడం ఖాయం. 'సైరా' తెలుగు మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి నిహారిక కు మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది.

ఇక 'సైరా' లో ఇప్పటికే చాలామంది పాపులర్ స్టార్స్ నటిస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ - విజయ్ సేతుపతి - సుదీప్ లతో పాటు నయనతార - తమన్నా లు కూడా నటిస్తున్నారు. ఇక ప్రకాష్ రాజ్ - నాజర్ లాంటి టాలెంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాత.