Begin typing your search above and press return to search.

'ప్రభాస్'తో పెళ్లా..నో..వే! అంటున్న మెగా హీరోయిన్

By:  Tupaki Desk   |   23 April 2020 1:40 PM IST
ప్రభాస్తో పెళ్లా..నో..వే! అంటున్న మెగా హీరోయిన్
X
టాలీవుడ్ లో మెగా వారసురాలిగా నిహారికకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినీ రంగంలో నాగబాబు కూతురుగా కంటే హీరోయిన్‌గా తనని తాను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే మొదటి నుండి కూడా ఫ్యామిలీ నుండి కావాల్సిన ఎంకరేజ్ మెంట్ ఉండటంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఇంతవరకు నిహారిక ఖాతాలో సరైన హిట్ పడకపోవడం నిరాశ కలిగించే విషయం. చేసిన సినిమాలన్నీ ఫ్లాప్‌ అవుతుండటంతో అవకాశాలు కూడా తగ్గినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన నిహారిక సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు బయట పెట్టింది నిహారిక. సినిమాలు కొంతకాలం మాత్రమే చేస్తానని చెప్పటంతో త్వరలోనే నిహారిక పెళ్లి పీటలు ఎక్కబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఇటీవలే గ్లామర్స్‌ రోల్స్‌ చేయడానికి కూడా రెడీ అంటూ ప్రకటించేసింది. కానీ నిహారిక చేస్తానన్న ఫ్యాన్స్‌ ఎలా రిసీవ్ చేసుకుంటారోనని.. అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక సందర్భం వచ్చింది కదా అని.. ఓ అభిమాని గతంలో ప్రభాస్‌ ను నిహారిక పెళ్లి చేసుకోబోతున్నట్టుగా వచ్చిన వార్తలను ప్రస్తావించాడు. అతను మాట్లాడుతూ.. మీరు ప్రభాస్‌ ను పెళ్లి చేసుకుంటున్నట్టుగా వచ్చిన వార్తలు నిజమేనా?` అంటూ నిహారికను అడిగాడు. 'క్షమించాలి.. ఆ వార్తలలో ఎలాంటి నిజం లేదు. అవి కేవలం రూమర్స్‌ మాత్రమే. నేను ప్రభాస్‌ ను లవ్ చేయట్లేదు.. పెళ్లి చేసుకోవట్లేదు` అంటూ ఖరాఖండీగా జవాబిచ్చింది. నిహారిక సమాధానంతో ఫ్యాన్స్ డౌట్స్ అన్నీ క్లియర్ అయినట్లేనని భావిస్తున్నారు.