Begin typing your search above and press return to search.

మెగా డాట‌ర్ బ‌ర్డ్ టాట్టూ క‌థేమి?

By:  Tupaki Desk   |   2 Sep 2018 5:55 AM GMT
మెగా డాట‌ర్ బ‌ర్డ్ టాట్టూ క‌థేమి?
X
అన‌గ‌న‌గ‌న ఒక రాకుమారి.. ఆ రాకుమారికి ఇద్ద‌రు అన్న‌లు. ముగ్గురు బావ‌లు. వీళ్లంతా స్టార్లే. అన్న‌య్య పెద్ద స్టార్‌ గా ఎదిగేస్తున్నాడు. ఇంకో అన్న ఇప్ప‌టికే స్టారాధిస్టార్. అలానే ఒక బావ‌గారు పెద్ద‌న్న‌య్య‌తో పోటీప‌డే పెద్ద స్టైలిష్ స్టార్‌. ఇక చిన్న‌బావల్లో ఒక‌రు సుప్రీం హీరో అంత‌టి ఘ‌నుడే. వేరొక బావ కెరీర్ ప‌రంగా ఎదిగే ప్లాన్ లో ఉన్నాడు. డాడ్స్ ఆల్వేస్‌ గ్రేట్ స్టార్స్. ఇదంతా పైకి తెలిసిన రాకుమారి క‌థ. అన్న‌లు - బావ‌లు ఎవ‌రో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. ఆ రాకుమారి ఎవ‌రో కూడా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ది గ్రేట్ కొణిదెల రాకుమారి నీహారిక‌.

ఇప్ప‌టికి మూడు సినిమాల కిడ్ ఈ రాకుమారి. హిట్ట‌న్న‌ది ఈ న‌ట‌వార‌సురాలికి అంత వీజీగా చిక్కేట్టు లేదు. అయితే త‌న‌కు ఉన్న బ్యాక్‌ గ్రౌండ్ దృష్ట్యా అవ‌కాశాలకు కొద‌వేం లేదు. ఓవైపు బుల్లితెర - వెబ్ సిరీస్‌ లు - మ‌రోవైపు సినిమాలు ఎప్పుడూ క్యూ ఉంటూనే ఉంటుంది. దర్శ‌క‌నిర్మాత‌లు ఆస‌క్తిగానే ఉంటున్నారు. నీహారిక క్ష‌ణం లేనంత బిజీ.

అదంతా స‌రే.. ఇదిగో ఈ స్టిల్ చూశారా? నీహారిక అదిరిపోయే ఫోజిచ్చింది. చేతుల‌కు గోరింటాకు పండుతోంది. ఆ వీపు ఎడ‌మ భాగంలో ఓ టాట్టూ అంతే బ్యూటిఫుల్‌ గా ఆక‌ర్షిస్తోంది. అదో ప‌క్షి టాట్టూ. అందంగా కుదురుకుంది. యువ‌త‌రానికి చ‌క్కిలిగింత పెడుతోంది. పాశ్చాత్య సంస్కృతి అని తీసిపారేయ‌క‌పోతే ఈ క‌ల్చ‌ర్ నేటిత‌రంలో జోరుగా ఊపందుకుంది. స్టార్ల‌ను ఇమ్మిటేట్ చేస్తూ అంద‌రూ చేతుల‌పై, వీపు, మెడ భాగంపై ఇలాంటి ప‌చ్చ‌బొట్లు పొడిపించుకుంటున్నారు. ఇలాంటి టాట్టూల విష‌యంలో సీనియ‌ర్ నాయిక‌లు త్రిష‌ - ఛార్మి - ఇలియానా య‌మ‌స్పీడ్‌ గా ఉండేవారు. ఇప్పుడు న‌వ‌త‌రం నాయిక‌లు అనుస‌రిస్తున్నారు.