Begin typing your search above and press return to search.

లాస్యను పొగిడేసిన మోగా డాటర్

By:  Tupaki Desk   |   21 April 2016 2:11 PM GMT
లాస్యను పొగిడేసిన మోగా డాటర్
X
అవును... బుల్లితెర యాంకర్ లాస్యను మోగాడాటర్ నిహారిక పొగడ్తలతో ముంచెత్తింది. దాంతో లాస్య ఉబ్బితబ్బిబ్బయింది. ఇద్దరూ బుల్లి తెరపై యాంకర్లుగా రాణిస్తున్నారు. అయితే ఇటీవల మెగా డాటర్ నిహారిక వెండితెరపై కనిపించడానికి అడుగులు వేసింది. ఆమె నటించిన సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకొస్తోంది. మరి మెగా డాటర్ వెండితెరపై కనిపిస్తే.. తాను మాత్రం తక్కువా అనుకుందో ఏమో.. యాంకర్ లాస్య కూడా వెండితెర హీరో నందుతో కలిసి ఓ షార్ట్ ఫిలింలో నటించింది. సినిమాకు ఏమాత్రం తీసిపోని క్వాలిటీతో ఈ లఘుచిత్రం తెరకెక్కింది. ‘పోవే పోరా’ పేరుతో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిలిం ఇటీవల ప్రసాద్ ల్యాబ్లో స్క్రీనింగ్ చేశారు. ఈ కార్యక్రమానికి నాగబాబు కూతురు నిహారిక ముఖ్య అతిథిగా హాజరై లాస్యను తెగపొగిడేసింది.

లాస్య ప్రెజెంట్స్ తో... మంజునాథ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ లఘుచిత్రం... పెళ్లొద్దంటూ.. దాటవేసే ధోరణితో వ్యవహరించే యూత్ కోసం ఓ మెసేజ్ ఇవ్వాలనే కోణంలో ఈ చిత్రం తెరకెక్కింది. అనుకోకుండా కిడ్నాపైన ఒక అమ్మాయి... అబ్బాయి ఆ కిడ్నాపర్ల నుంచి ఎలా తప్పించుకున్నే ప్రయత్నం లో వాళ్ళ మద్య జరిగిన సంఘటనలే ఈ కధ. చివరకు వాళ్ళు ఎలా తప్పించుకున్నారు... అసలు ఆ కిడ్నాపర్లు ఎవరు అన్నదే మిగతా కథ. ఇందులో లాస్యతో పాటు... నందు నటించాడు. ఇతర పాత్రల్లో అర్జున్ - పూజిత - ప్రేమ్ కుమార్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి ప్రత్యూష. దర్శకుడు అనీల్ రావిపూడి - శేఖర్ మాస్టర్ - హర్షవర్దన్ తదితరులు ఈ లఘుచిత్రాన్ని తిలకించి లాస్యను అభినందించారు. ఇప్పటి వరకు యాంకర్ గానే కనిపించిన లాస్య... ఇప్పుడు ఈ లఘు చిత్రాన్ని సొంత బ్యానర్లో నిర్మించి నటించడాన్ని బట్టి చూస్తే... ఆమెకు నటనపట్ల వున్న ప్యాషన్ ఏంటో అర్థమవుతుందని అన్నారు.