Begin typing your search above and press return to search.

అమ్మ ఇష్ట ప్రకారమే మెగా డాటర్ పెళ్లి

By:  Tupaki Desk   |   9 May 2016 5:17 AM GMT
అమ్మ ఇష్ట ప్రకారమే మెగా డాటర్ పెళ్లి
X
మదర్స్ డే సందర్భంగా చాలామంది హీరోలు - హీరోయిన్లు.. వారి వారి అమ్మతో కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేశారు. వారిలో మెగా కుటుంబం నుంచి వచ్చిన తొలి హీరోయిన్ నీహారిక కొణిదెల కూడా ఉంది. అయితే ఓ ఫోటోతో సరిపెట్టేయకుండా.. బోలెడన్న సంగతులు చెప్పింది నీహారిక. సినిమాల నుంచి తన పెళ్లి వరకూ చాలానే మాటలు చెప్పింది ఈ మెగా డాటర్.

ప్రస్తుతం నీహారిక హీరోయిన్ గా నటించిన తొలి సినిమా 'ఒక మనసు' విడుదలకు సిద్ధమైంది. ఇంట్లో అందరినీ ఒప్పించి హీరోయిన్ గా మారడంతో.. రిలీజ్ - రిజల్ట్ పై టెన్షన్ గా ఉన్న మాట నిజమేనంటోంది నీహారిక. అయితే.. తనకు నెగిటివ్ గా ఫీడ్ బ్యాక్ వచ్చినా.. వ్యక్తిగతంగా తానేమీ కుంగిపోనని ధైర్యంగా చెబుతోంది. ఇప్పటివరకూ రెండో సినిమాని ఒప్పుకోకపోవడానికి కారణం.. తొలి మూవీ రిజల్ట్ కోసమే అని చెబ్తోంది నీహారిక.

అయితే.. తన పెళ్లి విషయంలో మాత్రం నిర్ణయం - అధికారం పూర్తిగా అమ్మకే అని నీహారిక చెబుతోంది. తనకు స్వేచ్ఛనిచ్చిన తల్లిదండ్రులకు.. తన పెళ్లి చేసే అధికారం ఇచ్చేశానని అంటోంది. 'ఒక గృహిణిగా మా అమ్మే నాకు రోల్ మోడల్. నేను కూడా పిల్లలను పెంచడం - కుటుంబాన్ని చూసుకుంటాను.' అని చెబుతూ.. పెళ్లయ్యాక సినిమాలు చేయబోనని చెప్పేసింది మెగా డాటర్ నీహారిక కొణిదెల.