Begin typing your search above and press return to search.

మెగా ప్రిన్సెస్ నీహారిక.. అదిరే

By:  Tupaki Desk   |   8 April 2016 5:19 AM GMT
మెగా ప్రిన్సెస్ నీహారిక.. అదిరే
X
మెగా బ్రదర్ నాగేంద్రబాబు కూతురు నీహారిక.. హీరోయిన్ గా అరంగేట్రం చేస్తున్న మూవీ ఒక మనసు. నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఈ మూవీని రామరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఉగాది సందర్భంగా ఇప్పుడీ 'ఒక మనసు' మూవీకి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది.

అందమైన ప్రేమ జంటగా క్యూట్ గా కనిపిస్తున్నారు హీరో నాగశౌర్య - హీరోయిన్ నీహారిక. మెగావారసురాలు అయినంత మాత్రాన లవ్ స్టోరీలో రొమాన్స్ ఉండదేమో అనే అనుమానాలకు కూడా ఫస్ట్ లుక్ లోనే సమాధానం చెప్పేసింది యూనిట్. హీరో హీరోయిన్లు దగ్గరగా ఉండే పోస్టర్ తో.. ఈ లవ్ స్టోరీలో రొమాన్స్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుందని అర్ధమవుతోంది.

ఏప్రిల్ చివరి వారంలో ఆడియో రిలీజ్ చేసి.. మే మూడో వారంలో 'ఒక మనసు' రిలీజ్ కానుందని.. యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో ఉన్న అన్ని పాటలు చక్కని మెలోడీలుగా మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ తీర్చిదిద్దాడు. అయితే.. తొలి సినిమాతోనే 'మెగా ప్రిన్సెస్' అనే ట్యాగ్ ను నీహారికకు ఇచ్చేయడం విశేషం.