Begin typing your search above and press return to search.

మెగా డాట‌ర్ తో అఖిల్ రొమాన్స్!

By:  Tupaki Desk   |   4 Jan 2016 12:14 PM GMT
మెగా డాట‌ర్ తో అఖిల్ రొమాన్స్!
X
నాగ‌బాబు కుమార్తె కొణిదెల నిహారిక మెగా ఫ్యామిలీని ఒప్పించి 'ఒక మ‌న‌సు' సినిమాలో నాగ‌శౌర్య స‌ర‌స‌న హీరోయిన్ గా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఒక మ‌నసు చిత్రంలో ఆమె ప‌ర్ ఫార్మెన్స్ అద్భుతంగా చేస్తుందంటూ యూనిట్ ద్వారా వార్త‌లొస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆమెకు చాలా అవ‌కాశాలు కూడా వ‌స్తున్నాయ‌ట‌. కానీ ఇప్పుడ‌ప్పుడే ఒప్పుకోవ‌ద్ద‌ని నాగ‌బాబు ఆమెకు చెప్పిన‌ట్లు సమాచారం. అయితే తాజాగా అందుతున్న స‌మాచార‌మేమిటంటే...నిహారికకు మ‌రో చిత్రంలో హీరోయిన్ గా న‌టించే అవ‌కాశం వ‌చ్చిందంట.

అఖిల్ సినిమా ఫ్లాప్ త‌ర్వాత ఆచితూచి అడుగు వేస్తున్నాడు అఖిల్. అయితే త‌న త‌దుప‌రి సినిమాకు సంబంధించిన ప‌నులు ఇప్ప‌టికే ప్రారంభించిన‌ట్లు తెలుస్తోంది. కానీ ఆ విష‌యాల‌న్నీ గోప్యంగా ఉంచుతున్నార‌ట‌. త్వ‌ర‌లో అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ట‌. అయితే ఈ సినిమాలో అఖిల్ స‌ర‌స‌న మెగా డాట‌ర్ నిహారిక‌ను హీరోయిన్ గా తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో వీరిద్ద‌రూ ఓ షార్ట్ ఫిలింలో్ స్ర్కీన్ షేర్ చేసుకున్నారు. ఈ సారి మూవీలో జంట‌గా న‌టించ‌బోతున్నారు. నిజంగా వీరిద్ద‌రూ జంట క‌డితే వెండితెర వెలిగిపోవాల్సిందే అంటున్నారు సినీ జ‌నాలు. చూద్దాం ఈ వీరివురి న‌డుమ కెమిస్ర్టీ ఏ రేంజులో వ‌ర్క‌వుట్ అవుతుందో.