Begin typing your search above and press return to search.

'కొండ పొలం' తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటారా..?

By:  Tupaki Desk   |   7 Oct 2021 4:30 PM GMT
కొండ పొలం తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటారా..?
X
క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ''కొండ పొలం''. ఇందులో మెగా సెన్సేషన్ పంజా వైష్ణవ్ తేజ్ - స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రేపు శుక్రవారం (అక్టోబరు 8) థియేటర్‌లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ముమ్మరంగా చేసిన మేకర్స్.. సినిమాపై బజ్ క్రియేట్ చేశారు.

'కొండ పొలం' ప్రచార చిత్రాలు - ట్రైలర్ మంచి స్పందన తెచ్చుకుని సినిమాపై అంచనాలు పెంచేశాయి. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరపరిచిన పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇది ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడిన గ్రామీణ అడ్వెంచర్ మూవీ. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా తెరకెక్కించారు. జెట్ స్పీడ్ లో అద్భుతమైన క్వాలిటీతో సినిమాలు రూపొందించే క్రిష్.. ఈ చిత్రాన్ని కేవలం 45 రోజుల్లో పూర్తి చేశారని తెలుస్తోంది.

'కొండ పొలం' చిత్రంలో గొర్రెల కాపరిగా.. ఉన్నత విద్య అభ్యసించిన రవీంద్ర యాదవ్‌ అనే యువకుడిగా పంజా వైష్ణవ్‌ తేజ్‌ కనిపించనిన్నారు. రవీంద్ర తనలోని భయాల్ని జయించి బయటికి రావడానికి అడవి ఎలా దోహదపడిందనే విషయానన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇక గొర్రెలు కాసే ఓబులమ్మ అనే పల్లెటూరి యువతి పాత్రలో రకుల్‌ ప్రీత్ సింగ్ అలరించనున్నారు. సాయి చంద్ - కోట శ్రీనివాసరావు - నాజర్ - అన్నపూర్ణ - హేమ - ఆంథోనీ - రవి ప్రకాష్ - రచ్చ రవి - మహేష్ విట్టా - ఆనంద్ విహారి - ఛత్రపతి శేఖర్ తదితరులు ఈ చిత్రంలో ఇతర పాత్రలు పోషించారు.

బిబో శ్రీనివాస్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందింది. సాయిబాబు జాగర్లమూడి - రాజీవ్ రెడ్డి దీనికి నిర్మాతలుగా వ్యవహరించారు. జ్ఞాన శేఖర్ వీఎస్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. రాజ్ కుమార్ గిబ్సన్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఈ ఏడాది ప్రారంభంలో 'ఉప్పెన' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్.. ''కొండ పొలం'' సినిమాలో ఎలా అలరిస్తారో చూడాలి.

ఇక 'కొండ పొలం' విజయం దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మరియు రకుల్ ప్రీత్ సింగ్ లకు కూడా కీలకమనే చెప్పాలి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన రకుల్.. గత కొంతకాలంగా తెలుగులో సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వస్తానని రకుల్ ధీమాగా ఉంది. అలానే 'ఎన్టీఆర్' బయోపిక్ తో నిరాశపరిచిన క్రిష్ కూడా ఈ ప్రాజెక్ట్ పై గట్టి నమ్మకం పెట్టుకున్నారు. ఇది సూపర్ హిట్ అయితే అదే కాన్ఫిడెన్స్ తో పవన్ కళ్యాణ్ తో 'హరి హర వీరమల్లు' సినిమాని ముందుకు తీసుకెళ్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మంచి అంచనాలతో రేపు థియేటర్లలోకి రాబోతున్న 'కొండ పొలం' చిత్రం వీరందరికీ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.