Begin typing your search above and press return to search.

కేటీఆర్ కు కోనవెంకట్ హెచ్చరిక

By:  Tupaki Desk   |   26 Sept 2019 2:55 PM IST
కేటీఆర్ కు కోనవెంకట్ హెచ్చరిక
X
ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ ట్విట్టర్ లో యమ యాక్టివ్ గా ఉంటారు. ఎన్నో అంశాలపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడిస్తారు. సినీ, రాజకీయాలపై ఆయన వేగంగా స్పందిస్తుంటారు.

తాజాగా హైదరాబాద్ లో భారీగా వానలు పడుతుండడం.. దాని ఫలితంగా శిథిలమవుతున్న రోడ్లు, ఇతర పారిశుధ్యంపై చాలా మంది కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా విజ్ఞాపనలు చేస్తున్నారు.

తాజాగా రచయిత కోన వెంకట్ ఓ ప్రమాదక పిల్లర్ కూలడానికి సిద్ధంగా ఉందంటూ దాని ఫొటోలు తీసి తెలంగాణ మంత్రి కేటీఆర్ కు హెచ్చరికలు చేశారు. పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ వే పిల్లర్ నంబర్ 20 వద్ద శిథిలమైందని.. ఇది ఎప్పుడైనా కూలే ప్రమాదం ఉందని.. బాధ్యత గల పౌరుడిగా ఈ అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నానని తెలిపారు.

ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకముందే దీనిపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ లో కోనవెంకట్ మంత్రి కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. దానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు.