Begin typing your search above and press return to search.

శ్రీరెడ్డిపై కేసుకు రెడీ అంటున్న కోన

By:  Tupaki Desk   |   12 April 2018 10:23 AM IST
శ్రీరెడ్డిపై కేసుకు రెడీ అంటున్న కోన
X
టాలీవుడ్ ను శ్రీరెడ్డి వ్యవహారం కుదిపేస్తున్న విషయం వాస్తవమే. ఒక్కొక్కరి చొప్పున సీరియల్ మాదిరిగా ప్రముఖుల పేర్లను బైట పెడుతోంది శ్రీరెడ్డి. రీసెంట్ గా ఈమె బయట పెట్టిన పేరు టాలీవుడ్ లో స్టార్ రైటర్ గా గుర్తింపు పొందిన కోన వెంకట్. ప్రస్తుతం రైటర్ గా కాస్త డౌన్ అయినా.. ఇండస్ట్రీలో కోనకు గుర్తింపు ఎక్కువే.

నేరుగా సినిమాలు నిర్మించడం.. ఇతర భాషల్లో కూడా పలు చిత్రాలకు భాగస్వామ్యం వహించడం వంటివి చేస్తుంటాడు కోన. తనను బలవంతంగా శారీరకంగా కోన వెంకట్ లోబరచుకున్నాడని శ్రీరెడ్డి కామెంట్ చేసింది. 'ఓ నటి కొందరు సినిమా వాళ్లతో నా పేరు మీద కూడా ఆరోపణలు చేసిన విషయం తెలిసి షాక్ తిన్నాను. ఈ విషయంలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నేరస్థులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాను.నిజం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నాను' అని చెప్పాడు కోన వెంకట్.

తాను తెలుగు నటీనటులను ప్రోత్సహిస్తాననని.. గీతాంజలి మూవీలో అందరూ తెలుగు నటులనే తీసుకున్నానని చెప్పాడు కోన వెంకట్. సినిమా రంగం అందరికీ సాఫ్ట్ టార్గెట్ అయిపోయిందని అభిప్రాయపడ్డాడు ఈ రైటర్. తెలుగు ఆర్టిస్టులకు తెలుగు సినిమాల్లో అవకాశాలు ఇవ్వడాన్ని తాను సపోర్ట్ చేస్తానన్నాడు కోన వెంకట్.