Begin typing your search above and press return to search.
పవన్ ఓపెన్ ఆఫర్ ఎప్పుడూ నా కోసం ఉంటుంది
By: Tupaki Desk | 2 Jan 2021 10:00 AM ISTటాలీవుడ్ లో స్టార్ రైటర్ ల జాబితా తీస్తే అందులో మొదటి వరుసలో కోన వెంకట్ ఉంటాడు అనడంలో సందేహం లేదు. ఎంతో మంది రచయితలు దర్శకులుగా మారుతున్నారు. కొందరు సూపర్ హిట్ అయ్యి ఇండస్ట్రీని ఏలేస్తుంటే కోన వెంకట్ మాత్రం దర్శకుడిగా మారేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇతర రచయితలకు భిన్నంగా కోన వెంకట్ నిర్మాతగా మారాడు. ఈయన నిర్మాణంలో ఈయన కథతో సినిమాలు చేసేందుకు చాలా మంది సీనియర్ స్టార్ లు యంగ్ స్టార్ లు సిద్దంగా ఉన్నారు. కాని ఆచితూచి మరీ కోన సినిమాలు చేస్తున్నాడు. గత ఏడాది నిశబ్దం అనే విభిన్నమైన సినిమాను కోన ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.
ఇటీవల ఒకానొక సందర్బంగా కోన వెంకట్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తో సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చాలా సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు సినిమా చేద్దామని ఆఫర్ ఇచ్చారు. ఏ కథ తీసుకు వచ్చినా.. దర్శకుడు ఎవరైనా నేను రెడీ అన్నట్లుగా పవన్ నాతో చెప్పారు. పవన్ కోసం ఎన్నో కథలు రాశాను. కాని అవి నాకే నచ్చ లేదు. ఇప్పటి వరకు ఎవరు చూపించని విధంగా పవన్ ను చూపించేందుకు నేను ప్రయత్నిస్తున్నాను. అందుకు ఇంకా కథ రెడీ కాలేదు. పవన్ కలిసిన ప్రతి సారి కథ రెడీ అయ్యిందా అని అడుగుతున్నారు. పవన్ నుండి నాకు ఎప్పుడు కూడా ఓపెన్ ఆఫర్ ఉంది. కాని కథ విషయంలో నన్ను నేను సంతృప్తి పర్చుకోలేక పోవడంతో సినిమా ముందుకు సాగడం లేదు. భవిష్యత్తులో అయినా పవన్ తో మూవీ ఉంటుందా అంటే చూడాలని కోన సమాధానం ఇచ్చారు.