Begin typing your search above and press return to search.

ఆస్కార్ విన్నర్ కోసం వెయిటింగ్

By:  Tupaki Desk   |   26 April 2016 5:30 PM GMT
ఆస్కార్ విన్నర్ కోసం వెయిటింగ్
X
అక్కినేని నాగచైతన్య హీరోగా.. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'సాహసం శ్వాసగా సాగిపో'. చాలా కాలంగా నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీ.. ఎట్టకేలకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు యూనిట్ వర్గాలు ప్రకటించాయి. ఈ చిత్రాన్ని రెండు భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తుండగా.. తెలుగు వెర్షన్ కు కోన వెంకట్ నిర్మాతగా ఉన్నాడు.

తెలుగులో చైతు - తమిళ్ లో శింబు హీరోలుగా నటిస్తున్న ఈ మూవీలో.. మలయాళ బ్యూటీ మంజిమా మోహన్ రెండు భాషల్లోనూ హీరోయిన్ గా నటిస్తోంది. గతేడాది నవంబర్ నాటికే పూర్తి కావాల్సిన ఈ మూవీ.. శింబు బీప్ సాంగ్ వివాదంలో చిక్కుకోవడంతో ఆలస్యం జరిగింది. ఎట్టకేలకు ఎన్నో అవాంతరాలను దాటుకుని ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ విషయాన్ని కోన వెంకట్ ట్వీట్ ద్వారా తెలియచేశాడు. 'సాహసం శ్వాసగా సాగిపో క్లైమాక్స్ షూటింగ్ కూడా ముగిసింది. ఆడియో విడుదలకు ఏర్పాట్లు చేసుకునేందుకు సిద్ధమవుతున్నాం. రెహమాన్ సార్ డేట్ ఇస్తారని ఎదురుచూస్తున్నాం. ఆయన డేట్ చెప్పగానే.. మీకు ఈ తేదీ చెప్పేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాం' అని ట్వీట్ చేశాడు కోన వెంకట్.

దీని తర్వాత కూడా చైతూ ఓ సినిమాని దాదాపు కంప్లీట్ చేసేశాడు. మలయాళ మూవీ ప్రేమమ్ ని అదే పేరుతీ రీమేక్ చేస్తూ.. దాదాపుగా పూర్తి చేసేశాడు. నిజానికి ప్రేమమ్ తొలుత రిలీజ్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు అనుకున్నాయి కానీ.. ఇప్పుడు ఆడియో రిలీజ్ జరిపి.. మే నెలాఖరులో సాహసం శ్వాసగా సాగిపోను విడుదల చేసేలా యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.