Begin typing your search above and press return to search.

మళ్ళీ డైరక్టర్ మిస్సింగ్‌.. ప్చ్‌

By:  Tupaki Desk   |   7 Nov 2015 9:15 AM IST


ఏమన్నా అంటే అన్నారు అంటూ సోషల్‌ నెట్‌ వర్క్‌ లో అవాకులూ చివాకులూ పేలుస్తుంటారు కాని.. చేసే పనులపై కామెంట్లు చేస్తే మాత్రం తట్టుకోలేరు. టాలీవుడ్ లో చాలా క్యాంపులది ఇదే పరిస్థతి. అసహనానికి కేరాఫ్‌ అడ్రస్‌ గా మారిపోతున్నారు. అదిగో నిధానంగా హూమర్‌ రాజా అయిన కోన వెంకట్‌ అండ్‌ కో కూడా ఇందులోకే ఎంట్రీ ఇస్తున్నారు.

మొన్న రిలీజ్‌ చేసిన మేకింగ్‌ వీడియోలో.. నిఖిల్‌ 'శంకరాభరణం' సినిమా ప్రొడ్యూసర్‌ కోన వెంకట్‌.. టోటల్‌ గా ఎటు చూసినా కనిపించాడు కాని.. అస్సలు దర్శకుడు ఉదయ్‌ నందనవనం మాత్రం కనిపించలేదు. అప్పట్లో ఆయన ఏ నందనవనంలో కూర్చున్నాడో ఏంటో అనుకునే సమయంలో ఒక్కసారిగా ఆడియో లాంచ్‌ జరిగింది.. అక్కడ కూడా మనోడు కనిపించలేదు. అక్కడ కూడా మిస్సింగే. కట్‌ చేస్తే.. ఇప్పుడు కొత్తగా మ్యూజిక్‌ మేకింగ్‌ వీడియో అంటూ ఒకటొచ్చింది. అందులో కూడా దర్శకుడు లేడు.

అంతా కోన వెంకట్‌ చేసినట్లే తెలుస్తోంది.. ఏంటది? అదేనండీ సినిమా మొత్తం ఆయనే హ్యాండిల్‌ చేసినట్లున్నారు. అయితే దర్శకుడు ప్రాజెక్టు నుండి తప్పుకున్నాడా లేక తప్పించారా అనే సందేహం వస్తోంది ఇప్పుడు. చూద్దాం ఏమంటారో...