Begin typing your search above and press return to search.

ఇదే తెలివైన‌ ప్ర‌శ్న స్వీటీని అడిగారా కోనా?

By:  Tupaki Desk   |   11 Aug 2020 10:00 AM IST
ఇదే తెలివైన‌ ప్ర‌శ్న స్వీటీని అడిగారా కోనా?
X
థియేట‌ర్లు ఇప్ప‌ట్లో తెర‌వ‌రు. ఇది ప‌క్కా నిజం. జ‌న‌వ‌రి వ‌ర‌కూ షూటింగులే చేయ‌రు. ఇది కూడా ప‌క్కా నిజం. అలాంట‌ప్పుడు పెండింగులో ఉన్న షూటింగులు పూర్తి చేసి .. రిలీజ్ కి రాని వాటిని రిలీజ్ చేయ‌డ‌మెలా? ప‌్ర‌స్తుతం టాలీవుడ్ పెద్ద‌ల ముందు ఉన్న బిగ్ ఫ‌జిల్ ఇది. క‌రోనా ఆట పాము- నిచ్చెన ఆట కంటే ప్ర‌మాద‌క‌రంగా మారింది. ఈ ఆట‌లో టాలీవుడ్ ఓడిపోతున్న‌ట్టే క‌నిపిస్తోంది. కానీ అన్నిటిని ఎదురించి గెలిచేదెలా?

స‌రిగ్గా ఇదే విష‌యంపై ప‌క్కాగా స్ట‌డీ చేసిన ది గ్రేట్ రైట‌ర్ కం నిర్మాత‌ కోన వెంక‌ట్ తెలివైన ప్ర‌క‌ట‌న చేశారు. ఆ ప్ర‌క‌ట‌న సారాంశం ఏమిటి? అంటే... ``మీరు థియేటర్ల కోసం జనవరి లేదా ఫిబ్రవరి వరకు వేచి ఉండాల్సి వస్తే... `నిశ్శ‌బ్ధం` చిత్రాన్ని ఏ వేదిక‌పై చూడాలనుకుంటున్నారు?`` అంటూ ట్వీట్ లో ప్ర‌శ్నించారు.

ఇంత‌కీ థియేట్రికల్ విడుదల లేదా OTT విడుదల దేనిని ఇష్ట‌ప‌డుతున్నారు? అన్న‌దే ఆయ‌న ప్ర‌శ్న. దీన‌ర్థం డిజిట‌ల్లో వ‌దిలేయాల‌న్న‌దే కోన ప్లాన్ అని అర్థ‌మ‌వుతోంది. కోన అడిగిన ప్ర‌శ్ననే చిత్ర క‌థానాయిక‌ అనుష్క‌ను అడిగితే ఏం సమాధానం చెబుతుంది? అంటే.. ``ఎక్క‌డ రిలీజ్ చేస్తే ఏంటి? జ‌నం ఆద‌రించారా లేదా? అన్న‌దే ముఖ్యం. నిర్మాత‌కు రిట‌ర్నులు వ‌చ్చి త‌న‌కు పారితోషికం క‌రెక్టుగా ముట్ట‌జెబితే చాల‌``న్న‌ది స్వీటీ వెర్ష‌న్ అయ్యుండొచ్చు. స్వీటీ వెర్ష‌న్ ప్రేక్ష‌కుల వెర్ష‌న్ కూడా ఒక‌టే అయ్యుండొచ్చు. వేచి చూసినా ప్ర‌యోజ‌నం శూన్యం అన్న‌ది మెజారిటీ ప్ర‌జ‌ల అభిప్రాయం. మ‌రి తెలివైన కోన ఇక డిజిట‌ల్ రాక‌పై దృష్టి సారిస్తేనే బెట‌రేమో!! నిశ్శ‌బ్ధం ఓటీటీలోకి వ‌చ్చేస్తే.. ఆ వెంట‌నే దాదాపు డ‌జ‌ను సినిమాలు క్యూలో రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి.