Begin typing your search above and press return to search.

ఈ టాప్-10 కోలీవుడ్ ని ఏం చేస్తాయో

By:  Tupaki Desk   |   2 Aug 2017 10:56 AM GMT
ఈ టాప్-10 కోలీవుడ్ ని ఏం చేస్తాయో
X
2017 ప్రథమార్థంలో కోలీవుడ్ బాగా డిజప్పాయింట్ అయింది. బాహుబలి2 మినహాయిస్తే మరే చిత్రం అక్కడ పెద్దగా డబ్బులు కురిపించలేకపోయింది. భారీ చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్స్ గా మారడంలో డిజప్పాయింట్ చేశాయి. దీనికి తోడు జీఎస్‌ టీ హంగామా మొదలైపోవడంతో సినిమా వ్యాపారంపై ప్రభావం పడింది. జీఎస్‌ టీ అమలు తర్వాత రిటర్న్ లను రాబట్టుకోవడం సాధ్యమేనా అని పలువురు నిర్మాతలు దిగులుపడ్డారు కూడా.

కానీ విక్రమ్ వేధ.. మీసాయి మురుక్కు సినిమాల సక్సెస్ లు ఈ ఆందోళలను తుడిచేశాయి. రాబోయే క్రేజీ సినిమాలపై ఇండస్ట్రీ జనాలు కన్నేసేలా చేశాయి. ఈ నెల 11న రిలీజ్ కానున్న ధనుష్ మూవీ వీఐపీ2 చిత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే యూ సర్టిఫికేట్ పొందిన ఈ మూవీ.. తమిళనాడు వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఆ తర్వాత ఆగస్ట్ 24న విడుదల కానున్న మూవీ వివేగం. అజిత్ నటించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉండగా.. ఇప్పటికే యూఏ సర్టిఫికేట్ పొందిన ఈ మూవీ.. తమిళనాడు బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందనే అంచనాలున్నాయి.

విజయ్ నటించిన మేర్సల్ చిత్రం షూటింగ్ పూర్తి కావస్తుండగా.. దీపావళికి ఈ సినిమా విడుదల కానుంది. సూర్య నటించిన తానా సేరేంద్ర కూట్టం పరిస్థితి కూడా ఇదే కాగా.. క్రిస్మస్ కు ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. విక్రం నటించిన స్కెచ్ షూటింగ్ చివరి దశకు చేరుకుందని అంటున్నారు. విక్రం మరో మూవీ ధృవనక్షత్రంపై కూడా అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. శివకార్తికేయన్ నటిస్తున్న వేలక్కారన్.. జయం రవి హీరోగా రూపొందుతున్న టిక్ టిక్ టిక్.. కార్తి యాక్ట్ చేస్తున్న థ్రిల్లర్ తీరన్ అధిగారం ఒండ్రు.. విశాల్ నటిస్తున్న తుప్పరివాలన్ చిత్రాలు కూడా కోలీవుడ్ మార్కెట్ ను షేక్ చేస్తాయనే అంచనాలున్నాయి.