Begin typing your search above and press return to search.

టాలీవుడ్ కోలీవుడ్ లో ఇదో కొత్త ట్రెండ్

By:  Tupaki Desk   |   27 Aug 2021 7:00 AM IST
టాలీవుడ్ కోలీవుడ్ లో ఇదో కొత్త ట్రెండ్
X
టాలీవుడ్ కోలీవుడ్ లో కొత్త ట్రెండ్ కొన‌సాగుతోంది. పేరున్న ద‌ర్శ‌క హీరోలు నిర్మాత‌లు ఏక‌మ‌వుతున్నారు. అలాగే పాపుల‌ర్ ద‌ర్శ‌కులు నిర్మాత‌లుగా మారి న‌వ‌త‌రానికి అవ‌కాశాలు క‌ల్పిస్తూ కొత్త జోన‌ర్ సినిమాల కోసం వెబ్ సిరీస్ ల నిర్మాణం కోసం ప్ర‌య‌త్నించ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

ఇలా చేయ‌డం సృజ‌నాత్మ‌క‌త‌కు విస్త్ర‌త అవ‌కాశాల్ని క‌ల్పిస్తోంది. తెలుగులో అగ్ర నిర్మాత‌లంతా ఇత‌ర న‌వ‌త‌రం ద‌ర్శ‌కుల‌ను నిర్మాత‌ల‌ను క‌లుపుకుని ప్ర‌యోగాత్మ‌క సినిమాల్ని ఎంక‌రేజ్ చేస్తున్నారు. అటు కోలీవుడ్ లోనూ ఇలాంటి పోక‌డ ఆస‌క్తిని క‌లిగిస్తోది. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ట్రెండీ స్క్రిప్టుల‌తో సినిమా నిర్మాణంలోకి అడుగుపెడుతోంది.

చాలా మంది సీనియర్ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఇప్పుడు ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ల‌ కోసం చేతులు కలుపుతున్నారు. మణిరత్నం- శంకర్- వేట్రిమారన్ స‌హా ఏఆర్ మురుగదాస్-గౌతమ్ మీనన్- లింగుసామి- మిస్కిన్- శశి- వసంత బాలన్- బాలాజీ శక్తివేల్-లోకేష్ కనగరాజ్ సంయుక్తంగా కొత్త నిర్మాణ సంస్థ ``రెయిన్ ఆన్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్`` ని ప్రారంభిస్తున్నారు. ఈ సంస్థ‌లో మొదటి చిత్రానికి లోకేష్ కనగరాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. అత‌డు ఇటీవ‌ల వెంట వెంట‌నే విజ‌యాల‌తో దూకుడుమీద ఉన్న సంగ‌తి తెలిసిందే.

హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ల తరహాలో రెవెన్యూ మోడల్ ని డిజైన్ చేసి ప్ర‌యోగాలు చేస్తున్నారు. ఈ బ్యాన‌ర్ లో ఫీచర్ ఫిలింస్.. వెబ్ సినిమాలు.. OTT ఒరిజినల్స్‌ని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. డైరెక్టర్ల బృందం ఇప్పటికే కొన్ని ఓటీటీ వేదిక‌ల‌తో చర్చలు జరుపుతున్నారు. సాధ్య‌మైనంత తొంద‌ర్లో తమ కాంబినేషన్ నుండి మొదటి ప్రాజెక్ట్ వివరాలను వెల్ల‌డిస్తారు. ఇది ష్యూర్ షాట్ గా అంద‌రికీ లాభాల్ని తెచ్చే ప్ర‌యోగం అని చెప్పొచ్చు.