Begin typing your search above and press return to search.

అఫిషియల్‌.. తెలుగు లో కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌

By:  Tupaki Desk   |   26 Sep 2021 12:40 PM GMT
అఫిషియల్‌.. తెలుగు లో కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌
X
కోలీవుడ్‌ సూపర్ స్టార్ విజయ్ టాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ గత కొన్ని నెలులగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దిల్ రాజు బ్యానర్ లో మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందబోతుందని ప్రముఖ మీడియా సంస్థలు కూడా కథనాలు ఇచ్చాయి. అయితే విజయ్ బర్త్‌ డే సందర్బంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. కాని ఆ రోజు ఎలాంటి అప్‌డేట్‌ రాకపోవడంతో సినిమా ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం విజయ్‌ చేస్తున్న సినిమాలు పూర్తి అవ్వడానికి సమయం పడుతుంది కనుక తెలుగు లో ఆయన సినిమాకు సమయం పడుతుందేమో అని మరి కొందరు అన్నారు. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న థలపతి టాలీవుడ్‌ ఎంట్రీ కి సంబంధించిన అఫిషియల్‌ అనౌన్స్ మెంట్‌ వచ్చింది.

దర్శకుడు వంశీ పైడిపల్లి ట్విట్టర్ లో విజయ్‌ తో తన సినిమాను అధికారికంగా ప్రకటించాడు. థలపతి 66వ సినిమాను వంశీ పైడిపల్లి తెరకెక్కించబోతున్నాడు. నా తర్వాత సినిమా గురించి ఈ ఎగ్జైటింగ్‌ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థలపతి విజయ్ సర్‌ తో నా సినిమా ను దిల్‌ రాజు గారు మరియు శిరీష్‌ గారు నా హోమ్‌ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నిర్మాణం జరుగబోతుంది అంటూ అఫిషియల్ గా ప్రకటించాడు. ఈ సినిమా పట్టాలెక్కేది ఎప్పుడు.. షూటింగ్‌ కు సంబంధించిన విషయాలు అతి త్వరలోనే వెళ్లడించబోతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

SVC బ్యానర్‌ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఇది మాకు గర్వించదగ్గ విషయం. ఈ విషయాన్ని షేర్‌ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ విజయ్‌ తో వంశీ పైడిపల్లి దర్వకత్వంలో సినిమాను చేయబోతున్నందుకు నిర్మాతలు దిల్ రాజు మరియు లక్ష్మణ్‌ లు కూడా చాలా ఎగ్జైట్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈమద్య కాలంలో కోలీవుడ్‌ హీరోలు టాలీవుడ్‌ వైపు చూస్తున్నారు. తెలుగు సినిమా చేస్తే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉంటుందనే ఉద్దేశ్యంతో చాలా మంది తెలుగు లో నటించేందుకు సిద్దం అవుతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కేవలం ద్వి భాష సినిమాగానే కాకుండా పాన్ ఇండియా మూవీగా విడుదల అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం విజయ్‌ చేస్తున్న సినిమాలు పూర్తి అయిన వెంటనే వంశీకి డేట్లు ఇచ్చే అవకాశం ఉంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది ఆరంభంలోనే సినిమాను పట్టాలెక్కిస్తారని తెలుస్తోంది.