Begin typing your search above and press return to search.

మెగా హీరో ప్రశంసలు అందుకున్న మక్కల్ సెల్వన్

By:  Tupaki Desk   |   17 March 2019 2:22 PM GMT
మెగా హీరో ప్రశంసలు అందుకున్న మక్కల్ సెల్వన్
X
కోలీవుడ్ లో సాధారణ నటుడిగా మొదలుపెట్టి ఇప్పుడు క్రేజీ హీరోగా మారిన విజయ్ సేతుపతికి ఇప్పుడు తమిళంలో మాత్రమే కాకుండా సౌత్ అంతా రికగ్నిషన్ ఉంది. తమిళం తప్ప ఇతర సినిమాలు చేయకపోయినా ఇలాంటి గుర్తింపు ఉండడం అసాధారణమే. రీసెంట్ గా విజయ్ సేతుపతిని మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రశంసలతో ముంచెత్తాడు.

తేజు ప్రస్తుతం తన కొత్త సినిమా 'చిత్రలహరి' ప్యాచ్ వర్క్ ను పూర్తి చేయడంలో బిజీగా ఉన్నాడు. 'చిత్రలహరి' షూట్ జరుగుతున్న లొకేషన్ లోనే విజయ్ సేతుపతి కొత్త సినిమా షూటింగ్ కూడా జరుగుతోందట. ఈ సందర్భంగా విజయ్ సేతుపతిని తేజు కలవడం జరిగింది. కొద్దిసేపు ముచ్చటించుకోవడమే కాకుండా ఇద్దరూ కలిసి ఫోటోలకు కూడా పోజులిచ్చారు. ఒక ఫోటోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ తేజూ "ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ #మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి సర్. మిమ్మల్ని కలవడం ఎంతో సంతోషంగా ఉంది. రాశి ఖన్నా.. ఆయనకు నన్ను పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు" అంటూ ట్వీట్ చేశాడు. ఇద్దరూ ఫోటోలో చిరునవ్వులు చిందిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి 'సైరా' తో విజయ్ సేతుపతి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కాకుండా 'సూపర్ డీలక్స్' త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ రెండిటితో పాటు మూడు ఇతర సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.