Begin typing your search above and press return to search.

తెలుగు ఫిల్మ్ ఛాంబ‌ర్ నూత‌న అధ్య‌క్షుడిగా కొల్లి రామ‌కృష్ణ‌

By:  Tupaki Desk   |   27 April 2022 1:21 PM GMT
తెలుగు ఫిల్మ్ ఛాంబ‌ర్ నూత‌న అధ్య‌క్షుడిగా కొల్లి రామ‌కృష్ణ‌
X
తెలుగు చ‌ల‌న చిత్ర వాణిజ్య మండ‌లి అధ్య‌క్షులు నారాయ‌ణ దాస్ కిష‌న్ దాస్ నారంగ్ గ‌త కొంత కాలంగా అనారోగ్య కార‌ణాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. సుధీర్ఘంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఏప్రిల్ 19న క‌న్నుమూశారు. దాంతో ఏప్రిల్ 27న ఫిలిం ఛాంబ‌ర్ కార్య‌వ‌ర్గం స‌మావేశ‌మైంది. ఛాంబ‌ర్ నియ‌మ నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి కొల్లి రామ‌కృష్ణ‌ను నూత‌న అధ్య‌క్షుడిగా ఎన్నుకున్నారు.

కొన్ని రామ‌కృష్ణ రిథ‌మ్ డిజిట‌ల్ థియేట‌ర్స్ అధినేత అయిన కొల్లి రామ‌కృష్ణ ఉపాధ్య‌క్షులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అయితే ఇటీవ‌ల అధ్య‌క్ష ప‌దవిలో వున్న ఏషియ‌న్ ఫిలింస్ అధినేత‌, ప్ర‌ముఖ నిర్మాత నారాయ‌ణ‌ దాస్ కిష‌న్ నారంగ్ అనారోగ్యం కార‌ణంగా మృతి చెందారు. దీంతో ఉపాధ్య‌క్షుడిగా వున్న కొల్లి రామ‌కృష్ణ‌ని ఛాంబ‌ర్ నియమ నిబంధ‌న‌ల‌ని అనుస‌రించి అధ్య‌క్షుడిగా ఎన్నుకున్నారు.

ఫిలిం ఛాంబ‌ర్ నూత‌న అధ్య‌క్షుడిగా కొల్లి రామ‌కృష్ణ ప‌ద‌వీ కాలం ఈ ఏడాది జూలై 31 వ‌ర‌కూ ఉంటుంద‌ని ఛాంబ‌ర్ కార్య‌ద‌ర్శులు కె.ఎల్‌. దామోద‌ర ప్ర‌సాద్‌, ఎం. ర‌మేష్ తెలిపారు.