Begin typing your search above and press return to search.

మిల్కీ ఫ్యాన్స్!! డ్యాన్స్ ట్రీట్ ఇదిగో

By:  Tupaki Desk   |   12 Oct 2016 2:01 PM IST
మిల్కీ ఫ్యాన్స్!! డ్యాన్స్ ట్రీట్ ఇదిగో
X
''అభినేత్రి'' సినిమాలో మిల్కీ బ్యూటి తమన్నా అభినయం ఎలా ఉన్నా కూడా.. ఆమె డ్యాన్సులు మాత్రం అదిరిపోయాయ్. ప్రతీసారి ఊరమాస్ డ్యాన్సుల్లో హీరోలకు సైతం చెమట్లు పట్టించేసే ఈ ముంబయ్ పోరీ.. ఇప్పుడు మాత్రం గ్రేస్ తో కూడిన కొన్ని స్లో అండ్ స్పీడ్ స్టెప్పులు వేసి మతిపోగొట్టేసింది. మరి కేవలం సినిమా చూసినోళ్లకేనా ఈ ట్రీట్ అంతా?

అందుకే ఇప్పుడు ప్రభుదేవా కొరియోగ్రాఫీలో రూపొందిన ఆ సోలో సాంగ్ ను వీడియో రూపంలో యుట్యూబ్ లో రిలీజ్ చేశారు. కత్తిలాంటి అందాలను దారబోయడమే కాకుండా.. డబ్ స్టెప్ తరహా స్టెప్స్ తో మతిపోగొట్టేసింది తమన్నా. ముఖ్యంగా ప్రభు కొరియోగ్రాఫీకి న్యాయం చేసింది. ఈ పాటకోసం చాలామంది సినిమాను రెండోసారి కూడా చూశారంటే చూస్కోండి మరి. ఇకపోతే ఇప్పుడు యుట్యూబ్ లోకి సినిమా ఎంట్రీ ఇచ్చేసిందికాబట్టి.. ఖచ్చితంగా అభిమానలు పండగ చేసుకుంటారంతే.

అయితే ''అభినేత్రి'' తరువాత తమన్నా కెరియర్ అన్ని బాషల్లో బీభత్సంగా టర్న్ అవుతుంది అనుకుంటే.. ఈ సినిమా హిందీ వర్షెన్ మూడు రోజుల్లో కేవలం 1.85 కోట్ల నెట్ మాత్రమే వసూలు చేసింది. అంటే బాలీవుడ్ లో వర్కవుట్ కానట్లే.