Begin typing your search above and press return to search.

ఎడారిలో సెగలు పుట్టించిన సొగసరి

By:  Tupaki Desk   |   12 Oct 2017 10:21 AM IST
ఎడారిలో సెగలు పుట్టించిన సొగసరి
X
అందంతోపాటు అద్భుతమైన ఫిజిక్.. ఆకట్టుకునే లావణ్యం.. కాస్తంత యాక్టింగ్ టాలెంట్ అన్నీ ఉన్నా ఎందుకో రాయ్ లక్ష్మికి టైమే సరిగా కలిసిరాలేదు. హీరోయిన్ గా ఎన్ని పాత్రలు చేసినా కోరుకున్నా బ్రేక్ రాకపోవడంతో ఐటం సాంగులతో మెరిపించడం మొదలెట్టింది. అనుకోని రీతిలో బాలీవుడ్ ఎరోటిక్ సినిమా జూలీ-2లో నటించే అవకాశం రావడంతో తనలో ఉన్న టాలెంట్లను ఈ సినిమాలో ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

రీసెంట్ గా జూలీ-2 సినిమాలో కోయీ హోస్లాతో హో సాంగ్ రిలీజ్ చేశారు. ఎడారి నేలపై రాయ్ లక్ష్మి తన అందాలన్నీ ఆరబోస్తూ వేసిన స్టెప్పులు చూస్తే ప్రేక్షకుల గుండెల్లో సెగలు పుట్టడం ఖాయం. ఇదే పాటలో సినిమా కాన్సెప్ట్ కూడా రిలీవ్ చేశారు. బాలీవుడ్ కు క్రికెట్ ఫీల్డ్ కు.. ఈ రెండింటికీ అండర్ వరల్డ్ తో లింకులు.. వాటి పర్యవసనాలతో కథ నడుస్తుంది. ఈ పరిచయాల్లో ఏర్పడే అట్రాక్షన్స్.. అవి బెడ్ రూం వరకు ఎలా వెళ్తాయో కూడా సింపుల్ గా నెరేట్ చేశారు. ముఖ్యంగా క్రికెటర్ తో ఇంటిమేట్ సీన్లలో రాయ్ లక్ష్మి రెచ్చిపోయి మరీ నటించడం సౌత్ సినీ జీవులను ఆశ్చర్యపరిచింది.

జూలీ-2 నిర్మాత - దర్శకులు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఏ మాత్రం వమ్ము చేయకండా వీలైనంత వరకు తన అందాలతో కట్టిపడేయడానికి రాయ్ లక్ష్మి ప్రయత్నించింది. బాలీవుడ్ ఎరోటిక్ సినిమాల్లో కొత్త అధ్యాయం స్టార్ట్ చేయొచ్చన్న రేంజీలలో వెండితెరపై రొమాన్స్ చూపించింది. ఈమధ్య తెలుగు సినిమాల్లో విలన్ గా కనిపిస్తున్న భోజ్ పురి నటుడు రవికిషన్ ఇందులో ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు.