Begin typing your search above and press return to search.

పవన్ సినిమాలో కోహినూర్ వజ్రం

By:  Tupaki Desk   |   8 Jan 2023 2:30 AM GMT
పవన్ సినిమాలో కోహినూర్ వజ్రం
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఫ్యాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు ఎప్పుడు విడుదలవుతుందో కానీ ఆ సినిమాపై రోజురోజుకు అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి. టాలెంటెడ్ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఆ సినిమాను నిర్మాత AM రత్నం భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు ఇప్పటికే సగానికి పైగా ఫినిష్ అయ్యాయి.

ఇక మరికొన్ని కీలకమైన సన్నివేశాలను పూర్తి చేయడం కోసం ఇటీవల మరొక షెడ్యూల్ మొదలుపెట్టారు. రెండు వారాలపాటు కొనసాగే ఆ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ పది రోజులపాటు పాల్గొనబోతున్నాడు. అలాగే బాలీవుడ్ ప్రముఖ నటుడు బాబీ డియోల్ కూడా ఆ షెడ్యూల్లో వర్క్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే హరిహర వీరమల్లు సినిమా ఔరంగజేబు చారిత్రాత్మక నేపథ్యంలో తెరపైకి రాబోతోంది.

ఇక ఈ సినిమాలో దర్శకుడు ఎలాంటి కాన్సెప్ట్ ఎంచుకున్నాడు అనేది ఇంతవరకు ఎవరికి క్లారిటీ రాలేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం మూడు విధానమైన షేడ్స్ లో కనిపిస్తాడు అని తెలుస్తోంది. అయితే భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి కోహినూరు వజ్రం గురించి కూడా ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఆ వజ్రం చుట్టూ హీరోతో పాటు మరికొంత మంది పోరాడే విధానం కూడా హైలెట్ అవుతుందట. అయితే మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఆ వజ్ర నిజమైనదిగా ఉండాలి అని దర్శకుడు నిర్మాతలు నిర్ణయించుకున్నారట. దాదాపు 30 లక్షలు ఒక నిజమైన కోహినూర్ లాంటి డైమండ్ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ స్థాయిలో వజ్రం కొనుగోలు చేస్తే మాత్రం అమ్మేటప్పుడు అదే రేటుకు అమ్మాలి అంటే కుదరదు. మరి నిర్మాత ఈ విధంగా ఎందుకు ఆ స్థాయిలో రిస్క్ చేస్తున్నారు అనేది సినిమా చూస్తే గాని అర్థం అవ్వదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.