Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: జెండా ఎగరేస్తున్న ధనుష్

By:  Tupaki Desk   |   5 Oct 2016 7:30 PM GMT
ట్రైలర్ టాక్: జెండా ఎగరేస్తున్న ధనుష్
X
కోలీవుడ్ లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్న మూవీ 'కోడి'. దీని అర్ధం జెండా. పేరుకు తగ్గట్లుగానే ఇది కంప్లీట్ గా పొలిటికల్ థ్రిల్లర్. దానికి మరిన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ని పక్కాగా జోడించేశారు. అక్టోబర్ 27న విడుదల కానున్న కోడి.. ఇప్పటికే తమిళనాట సెన్సేషన్స్ కి రెడీ అయిపోతోంది.

ట్యాలెంటెడ్ యాక్టర్ ధనుష్ తొలిసారిగా డ్యుయల్ రోల్ పోషించడం.. కోడి స్పెషాలిటీ. అన్నాదమ్ములుగా డిఫరెంట్ రోల్స్ రెండిటినీ ట్రైలర్ లో పరిచయం చేసేశారు. ప్రధానంగా అన్న పాత్ర చుట్టూనే సినిమా తిరుగుతుందనే విషయం అర్ధమవుతోంది. అన్న పాత్రకు త్రిష.. తమ్ముడి పాత్రకు అనుపమా పరమేశ్వరన్ లు జోడీలుగా నటించారు. రాజకీయ నాయకురాలిగా త్రిష లుక్ అదిరిందనే చెప్పాలి. 25 గ్రామాలను విషతుల్యం చేసేసిన ఓ ఫ్యాక్టరీ చుట్టూ సాగిన పొలిటికల్ థ్రిల్లర్ ఇది. కోడిలో త్రిష రోల్ కి నెగిటివ్ షేడ్స్ ఉంటాయనే టాక్ వినిపిస్తోంది కానీ.. ట్రైలర్ మాత్రం అలా చూపించలేదు.

కోడికి తెలుగు డబ్బింగ్ వెర్షన్ వచ్చేసే అవకాశాలు పుష్కలంగానే ఉన్నాయి. త్రిషకు ఇక్కడ బోలెడంత ఫాలోయింగ్ ఉండడం.. ఈ మధ్య ధనుష్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుండడం.. అనుపమా పరమేశ్వరన్ కూడా తెలుగు ఆడియన్స్ కు తెలిసిన అమ్మాయే కావడం.. పాలిటిక్స్ చుట్టూ తిరిగే సినిమా కావడంతో.. ఇక్కడ కూడా కోడి జెండా ఎగరేసే ఛాన్సులు ఎక్కువగానే ఉన్నాయి.





Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/