Begin typing your search above and press return to search.

చిరంజీవి గారికి సారీ చెబుతున్నాను

By:  Tupaki Desk   |   19 July 2016 12:01 PM IST
చిరంజీవి గారికి సారీ చెబుతున్నాను
X
మెగాస్టార్ చిరంజీవితో అనేక సూపర్ హిట్ చిత్రాలు తీసిన దర్శకుడు ఎ.కోదండ రామిరెడ్డి. ఈ మధ్య ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈయన చిరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను కనుక ఇప్పుడు చిరంజీవితో సినిమా చేయాల్సి వస్తే కామెడీ - లవ్ - యాక్షన్ - డ్యాన్స్ లు ఉండే సినిమా చేస్తానని.. చిరంజీవి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు తీస్తే జనాలు చూడరని కోదండరామిరెడ్డి అనడం కాంట్రవర్సీగా మారింది.

అప్పుడు జరిగిన సంఘటనపై ఈ సీనియర్ దర్శకుడు మళ్లీ స్పందించారు. ఆంధ్రజ్యోతి పేపర్ కి వివరణ ఇస్తూ.. 'ఆ రోజు నేనేం మాట్లాడానో తర్వాతే ఆ తర్వాత పేపర్లలోను వెబ్ సైట్లలో చూశాకే అర్ధమైంది. అవన్నీ చూశాక నేను ఇలా మాట్లాడానా అని బాధపడ్డాను. దేవుడి సాక్షిగా చెబుతున్నా.. నాకు తెలియకుండానే ఏదో ఫ్లోలో ఆ రెండు మాటలు అనేశాను. చిరంజీవి గారితో నేను చాలా సినిమాలు చేశా. మా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఇప్పటికీ ఉంది. నేను కూడా చాలా ఫ్లాప్ సినిమాలు తీశాను. ఫలానా జోనర్ లో తీయమని చెప్పడానికి, అలా చేస్తే ఆడతాయని చెప్పడానికి నేనేమీ దేవుడిని కాదు. పొరపాటుగా మాట్లాడినందుకు చిరంజీవి గారికి - నిర్మాత చరణ్ కి - వివి వినాయక్ కు - మెగాభిమానులకు పత్రికా ముఖంగా సారీ చెబుతున్నాను' అన్నారు కోదండరామిరెడ్డి.

తప్పు చేసి తలెగరేసే ఈ రోజుల్లో.. యథాలాపంగా అన్న మాటలకు ఇంత సుదీర్ఘ వివరణ ఇచ్చిన కోదండరామిరెడ్డిని అభినందించాల్సిందే.