Begin typing your search above and press return to search.

కుర్ర క్రికెటర్ కన్ను కూడా ఆంటీ మీదనే!

By:  Tupaki Desk   |   8 Sep 2019 4:26 PM GMT
కుర్ర క్రికెటర్ కన్ను కూడా ఆంటీ మీదనే!
X
కెఎల్ రాహుల్ పేరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అసలే క్రికెట్ అంటే చెవులు ముక్కులు కోసుకునే జనాలు మన భారతీయులు.. అందుకే రాహుల్ గురించి పెద్దగా ఇంట్రో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక క్రికెట్ అంటే కిలోమీటర్ పరిగెత్తే వారికి కూడా కెఎల్ రాహుల్ పేరు తెలిసే ఉంటుంది. కారణం రాహుల్ ప్రేమ లీలలు.. సరస సల్లాపాల గురించి మీడియాలో ఇప్పటికే బోలెడు కథనాలు వచ్చాయి.

రాహుల్ కు అమ్మాయిల్లో చాలా ఫాలోయింగ్ ఎక్కువ అని.. ఇప్పటికే ఎంతో మందితో ఎడాపెడా డేటింగ్ చేశాడని వార్తలు వచ్చాయి. ఆ లిస్టు చెప్పుకుంటూ పోతే చాలా పెద్దది. రీసెంట్ గా సునీల్ శెట్టి డాటర్ అతియా శెట్టి తో రాహుల్ డేటింగ్ చేస్తున్నాడని ముంబై మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అదెన్ని రోజులు సాగుతుందో మనకు తెలియదు. ఇక రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో రాహుల్ తన ఫస్ట్ క్రష్ గురించి వెల్లడించి అందరిని షాక్ కు గురిచేశాడు. ఇంతకీ రాహుల్ మనసుపారేసుకున్న భామ ఎవరు అంటే బాలీవుడ్ లో సీనియర్ మోస్ట్ బికినీ బ్యూటీ మలైకా అరోరా. చాలా అంశాల్లో మలైకా తనకు నచ్చుతుందని రాహుల్ వెల్లడించాడు.

అంతా బాగానే ఉందికానీ అర్జున్ కపూర్ కు పోటీ రాడు కదా? జస్ట్ క్రష్ అయితే సరే..అంత కంటే ఎక్కువ ఆలోచిస్తేనే తంటా. అర్జున్ కపూర్ అసలే పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి ఉన్నాడని.. మలైకాను పెళ్ళి చేసుకుంటా అని మారాం చేస్తున్నాడని.. మలైకం వద్దు వద్దు.. అని వారిస్తోందని వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితిలో సీన్ లోకి కేఎల్ రాహుల్ లాంటి లవ్వర్ బాయ్ ఎంటర్ అయితే ఎలాంటి ట్విస్టులు చోటుచేసుకుంటాయనేది ఊహించడానికే భయంగా ఉంది. మలైకా కంటే అర్జున్ అయితే 12 ఏళ్ళు చిన్నవాడు.. ఈ రాహుల్ మరీ 19 ఏళ్ళు చిన్నవాడు. ఏంటో ఈ కలికాలం క్రష్షులు..!