Begin typing your search above and press return to search.

సూప‌ర్ స్టార్ కు లీగ‌ల్ నోటీసులు!

By:  Tupaki Desk   |   5 Aug 2018 7:11 AM GMT
సూప‌ర్ స్టార్ కు లీగ‌ల్ నోటీసులు!
X
ఓ తెలుగు-మ‌ల‌యాళ న‌టి కిడ్నాప్ తోపాటు వేధింపుల కేసులో ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టుడు దిలీప్ బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దాదాపు 3నెల‌ల‌పాటు జైలులో ఉన్న‌ దిలీప్ ను `అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మావీ ఆర్టిస్ట్స్(అమ్మ) `లో తిరిగి చేర్చుకోవ‌డంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తిన సంగ‌తి తెలిసిందే. కేసు విచార‌ణ‌లో ఉండ‌గానే....దిలీప్ కు `అమ్మ‌`లో స‌భ్యత్వం క‌ల్పించిన అధ్య‌క్షుడు మోహ‌న్ లాల్ పై ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో కేరళ ప్రభుత్వం ప్రకటించే సినిమా అవార్డుల ఫంక్షన్ కు మోహ‌న్ లాల్ ను బాయ్ కాట్ చేయాల‌ని ప‌లువురు నటీన‌టులు అభిప్రాయ‌ప‌డ్డారు. దిలీప్ పై `అమ్మ‌`నిషేధం ఎత్తివేయాల‌న్న నిర్ణయంతో మోహ‌న్ లాల్ ప్ర‌తిష్ట కొద్దిగా మ‌స‌క‌బారింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ నేప‌థ్యంలో తాజాగా మోహ‌న్ లాల్ కు మ‌రో షాక్ త‌గిలింది.

ఓ అడ్వ‌ర్ ట‌యిజ్ మెంట్ లో భాగంగా చ‌ర‌ఖాను వాడిన మోహ‌న్ లాల్ కు కేరళ ఖాదీ అండ్ విలేజ్ ఇండ‌స్ట్రీస్ బోర్డు వైస్ చైర్మ‌న్ శోభ‌నా జార్జి లీగ‌ల్ నోటీసులు పంప‌డం కేర‌ళ‌లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఓ ప్ర‌ముఖ టెక్స్ టైల్ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన యాడ్ లో మోహ‌న్ లాల్ న‌టించారు. అందులో, చ‌ర‌ఖాను తిప్పుతూ మోహ‌న్ లాల్....స‌ద‌రు కంపెనీ దుస్తుల‌ను ప్ర‌మోట్ చేశారు. అయితే, అవి ఖాదీ దుస్తులు కావ‌ని....అటువంట‌పుడు ఖాదీ దుస్తుల‌కు - భార‌త జాతీయ‌త‌కు చిహ్నంగా ఉన్న చ‌ర‌ఖాను ఆ యాడ్ లో ఎందుకు ఉప‌యోగించార‌ని శోభ‌నా లీగల్ నోటీసులో పేర్కొన్నారు. మోహ‌న్ లాల్ తో పాటు స‌ద‌రు టెక్స్ టైల్ కంపెనీ ఎండీకి కూడా శోభన లీగ‌ల్ నోటీసులు ఇచ్చారు. అయితే, ఈ నోటీసుల‌పై మోహ‌న్ లాల్ స్పందించాల్సి ఉంది.