Begin typing your search above and press return to search.

ఆమెతో ముద్దు సీన్స్‌ నరకంలా ఉండేది

By:  Tupaki Desk   |   8 Oct 2021 12:30 PM GMT
ఆమెతో ముద్దు సీన్స్‌ నరకంలా ఉండేది
X
హీరో హీరోయిన్‌ మద్య ముద్దు సన్నివేశాలు.. రొమాంటిక్ సన్నివేశాలు ఈమద్య కాలంలో సినిమాల్లో చాలా కామన్ విషయం. గత పది పదిహేను సంవత్సరాలుగా ఇండియన్ సినిమాల్లో ఇవి కామన్ విషయాలు. కాని హాలీవుడ్‌ సినిమాల్లో ఇవి ఎప్పటి నుండో కామన్ విషయాలు. ముద్దు సన్నివేశాలు లేకుండా హాలీవుడ్‌ సినిమాలు ఉండవేమో అనుకునే వారు అప్పట్లో. ఇండియన్‌ సినీ అభిమానులు చాలా మంది హాలీవుడ్ సినిమాలను ముద్దు సన్నివేశాలు మరియు రొమాంటిక్ సన్నివేశాల కోసం చూడటం చేసేవారు. అలాంటి ఒక సినిమా ద గుడ్ గర్ల్‌. 2002 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా లో హీరోయిన్ గా జెన్నిఫర్‌ అనిస్టన్‌ నటించగా హీరోగా హాలీవుడ్‌ స్టార్‌ హీరో జేక్‌ గైలెన్హల్‌ నటించాడు. ఆ సినిమాలో ముద్దు రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయి.

ఆ సన్నివేశాల్లో నటిస్తున్న సమయంలో నరకంలా ఉండేదంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జేక్‌ చెప్పుకొచ్చాడు. ఆమె తో ఆ సన్నివేశాల విషయంలో చాలా నర్వస్ అయ్యేవాడిని అని చాలా ఇబ్బంది పడే వాడిని అన్నాడు. చుట్టు 50 మంది చూస్తున్న సమయంలో అలాంటి సన్నివేశాల్లో ఆమెతో నటించడం నా వల్ల కాలేదు అన్నాడు. కొన్ని సందర్బాల్లో పిల్లోతో మ్యానేజ్ చేయగా కొన్ని సన్నివేశాలను మాత్రం చేయాల్సి వచ్చిందని.. అప్పుడు నరకం లా అనిపించిందని చెప్పుకొచ్చాడు. అంత నరకంగా రొమాంటిక్ సన్నివేశాలు అనిపించడంకు కారణం ఏంటీ అంటే ఆయన అప్పట్లో ఆమెను ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్న వ్యక్తితో అలాంటి సన్నివేశాలు చేయడం అంటే కాస్త ఇబ్బందే. అంటే అవతలి వైపు నుండి కూడా ప్రేమ ఉంటే పర్వాలేదు కాని ఒక్క వైపు నుండి ప్రేమ ఉన్నప్పుడు అలాంటి సన్నివేశాలు చేస్తే ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది.

ఆ విషయాన్ని షూటింగ్‌ సమయంలో ఆయన చెప్పలేక పోయాడు. మనసులో ఏమీ లేకుండా నటించడం అంటే ఏం కాదు. కాని మనసులో ఆమెపై క్రష్‌ ఉన్నప్పుడు ఎలా బయటకు పడకుండా నటించడం ఎలా అనే ఉద్దేశ్యంతోనే చాలా ఇబ్బంది పడ్డట్లుగా చెప్పుకొచ్చాడు. 2016 సంవత్సరంలో తనకు జెన్నీఫర్‌ అంటే క్రష్‌ అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ద గుడ్ గర్ల్‌ సినిమా సమయం నుండే ఆమె అంటే ఇష్టం అన్నట్లుగా జేక్‌ పేర్కొన్నాడు. అప్పటికే ఆమె బ్రాడ్‌ ఫిట్‌ ను పెళ్లాడి వైవాహిక జీవితంలో సెటిల్ అయ్యింది. అయినా కూడా ఆమె పై జేక్ కు ప్రేమ ఉండేదట. ఆ ప్రేమ కారణంగానే ముద్దు సన్నివేశాల్లో నటించడం ఇబ్బందిగా అనిపించిందని చెప్పుకొచ్చాడు.