Begin typing your search above and press return to search.

రైమింగ్ బాగుంది.. మీనింగ్ ఏది?

By:  Tupaki Desk   |   1 Nov 2017 4:55 AM GMT
రైమింగ్ బాగుంది.. మీనింగ్ ఏది?
X
త్రివిక్రమ్ డైలాగ్స్ జనాలకు నచ్చడం మొదలుపెట్టిన తర్వాత.. తెలుగు సినిమాల్లోనే కాదు.. బయట జనాల్లో కూడా మాటల్లో చాలానే మార్పులు వచ్చాయి. అర్ధం కాని పజిల్ టైపులో అర్ధం పర్ధం లేకుండా మాట్లాడి.. ఆ తర్వాత దానికేదో స్పెషల్ మీనింగులు అంటగట్టడం అనే ట్రెండ్ బాగానే కంటిన్యూ అవుతోంది.

రీసెంట్ గా వచ్చిన ఉన్నది ఒకటే జిందగీ మూవీలో డైలాగ్ ఇలాంటిదే. 'కాలేజ్ ఫ్రెండ్స్ ఎగ్జామ్ అయ్యేవరకు ఉంటారు. ఆఫీస్ ఫ్రెండ్స్ సాయంత్రం ఆరు అయ్యే వరకూ ఉంటారు. కానీ చిన్ననాటి స్నేహితులు చచ్చేంతవరకూ ఉంటారు'.. ఇదీ దర్శకుడు కిషోర్ తిరుమల అందిచిన డైలాగ్. వినేందుకు రైమింగ్ సూపర్బ్ గా ఉంది కానీ.. ఇందులో లాజిక్ మాత్రం అడక్కూడదు. ఎందుకంటే చాలా మంది చిన్ననాటి స్నేహాలను గుర్తు చేసుకుంటూనే బతుకుతారు. రియల్ వరల్డ్ లో ఆఫీస్ లోనో.. మరో ప్రాంతంలోనో స్నేహితులుగా మారుతుంటారు. కానీ ఈ డైలాగ్ కి జస్టిఫికేషన్ ఏంటంటే.. సినిమాలో హీరోలిద్దరూ చిన్ననాటి స్నేహితులు కావడమే.

ఇదే దర్శకుడు రామ్ తో తీసిన మరో మూవీ నేను శైలజలో కూడా ఇలాంటిదే ఓ అర్ధం పర్ధం లేని డైలాగ్ ఉంటుంది. పైగా అది సినిమాకి కీలకం కూడా. 'ఐ లవ్ యూ.. బట్ ఐయామ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ'.. నిన్ను ప్రేమిస్తున్నా కానీ.. నీతో ప్రేమలో లేనని హీరోయిన్ చెబుతుంది. వినేందుకు అయితే.. లాజిక్ ఉండదు. కానీ నిన్ను ఫ్రెండుగా ప్రేమిస్తున్నా.. లవర్ గా కాదు అని హీరోయిన్ భావం.

అర్ధం పర్ధం లేని డైలాగ్స్ నే సినిమాకి మెయిన్ పాయింట్ గా చేస్కుని.. మన దర్శకులు మెప్పిస్తున్న తీరును పొగడాలి కానీ.. ఈ ట్రెండ్ ని జనాలు ఎంతకాలం ఇష్టపడతారన్నదే అసలైన పాయింట్.