Begin typing your search above and press return to search.

కబాలిపై విలన్ చెప్పే కహానీ

By:  Tupaki Desk   |   20 July 2016 5:20 AM GMT
కబాలిపై విలన్ చెప్పే కహానీ
X
సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ కబాలిలో కిషోర్ విలన్ గా నటిస్తున్నాడు. సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ - లోకనాయకుడు కమల్ హాసన్ ల సినిమాల్లో విలన్ గా నటిస్తూ.. రీసెంట్ టైమ్ లో రికార్డునే సృష్టిస్తున్నాడీ విలన్. అసలు తనకు కబాలి మూవీలో ఛాన్స్ ఎలా వచ్చిందో అనే దగ్గర నుంచి.. రజినీకాంత్ కి విలన్ గా నటించడం వరకూ చాలా కబుర్లే చెప్పాడు కిషోర్.

'ఓ మూవీకోసం హైద్రాబాద్ లో ప్రకాష్ రాజ్ తో షూటింగ్ లో ఉండగా.. రజినీకాంత్ సినిమాలో ఆఫర్ రావచ్చని ఆయన చెప్పారు. ఆ తర్వాత నిర్మాత థాను ఫోన్ చేసి ఓ గ్యాంగ్ స్టర్ రోల్ ఉందన్నారు. ఎక్కువ సినిమాల్లో విలన్ రోల్స్ చేయడం కొంచెం కష్టమే అనాలి. కబాలిలో నా పాత్రకు కొంచెం హీరోయిజం కూడా ఉంటుంది. అయినా సరే నెగిటివ్ షేడ్స్ ఉండే రోల్స్ లో మెప్పించి రజినీకాంత్ కు విలన్ గా చేయడం అంటే ముందు టెన్షన్ పడ్డా.. ఆ తర్వాత మేనేజ్ చేసేశా' అంటున్నాడు కబాలి విలన్ కిషోర్.

కబాలిలో చాలా పాత్రలు రియల్ లైఫ్ రోల్స్ తో పోలి ఉంటాయని.. తన పాత్ర కూడా అంతే అన్న కిషోర్.. ఈ మూవీ చూశాక మలేషియాలో గ్యాంగ్ స్టర్లు ఎలా మొదలయ్యారో తెలుస్తుందని చెబుతున్నాడు. అలాగే రజినీకాంత్ తో ఢీ అంటే ఢీ అని ఫైట్ చేసే సన్నివేశాలు అద్భుతంగా రావడానికి ఆయన ఇచ్చిన సహకారం మరిచిపోలేనిది అని చెబుతున్నాడీ విలన్.