Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: కిరాక్ అనిపించిందిగా

By:  Tupaki Desk   |   31 Jan 2018 12:41 PM GMT
టీజర్ టాక్: కిరాక్ అనిపించిందిగా
X
కేశవ తర్వాత గ్యాప్ తీసుకున్న హీరో నిఖిల్ చాలా ఇష్టపడి చేస్తున్న రీమేక్ మూవీ కిరాక్ పార్టీ ట్రైలర్ ఇందాకా రిలీజ్ అయ్యింది. కాలేజీ లైఫ్, లవ్, స్టూడెంట్ పాలిటిక్స్ నేపధ్యంలో తీసిన ఈ సినిమా కన్నడ బ్లాక్ బస్టర్ కిరిక్ పార్టీకి అఫీషియల్ రీమేక్. హ్యాపీ డేస్ తర్వాత అంత జోష్ ఉన్న కాలేజీ స్టూడెంట్ రోల్ నిఖిల్ చేయలేదు. ఆ లోటు దీనితో తీరుతుందని నమ్మకంగా ఉన్నాడు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే చాలా సింపుల్ గా సరదా సరదా అల్లర్లు చేస్తూ కాలేజీలో తిరిగే హీరో గ్యాంగ్, పాటలు, చిందులు వెరసి చాలా కూల్ గా మొదలుపెట్టి లీడర్ గా నిఖిల్ కంప్లీట్ మేకోవర్ లోకి షిఫ్ట్ అయిపోయి మీసం, గుబురు గెడ్డంతో బాగా రఫ్ గా కనిపించడం చాలా కొత్తగా ఉంది. అంటే ఇది రెగ్యులర్ యూత్ స్టొరీ కాదని స్పష్టంగా చెప్పేసారు. మ్యూజికల్ గా కూడా మంచి స్కోప్ ఉన్న సబ్జెక్ట్ కావడంతో ఇందులో వినిపించిన అజనీష్ లోక్ నాథ్ ట్యూన్ కూడా చాలా ఫ్రెష్ గా అనిపించింది.

కర్ణాటకలో కొన్ని సెంటర్స్ లో ఏడాదిపైగా రన్ తో అల్ టైం ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఈ మూవీ నిఖిల్ కు మరో మేజర్ బ్రేక్ అయ్యే వైబ్రేషన్స్ ట్రైలర్ లో స్పష్టంగా ఉన్నాయి. దానికి తోడు ఈ మధ్య కాలంలో యూత్ కు కనెక్ట్ అయ్యే అవుట్ అండ్ అవుట్ క్లాసిక్ మూవీ ఏది రాకపోవడం కూడా కిరాక్ పార్టీకి ప్లస్ గా మారనుంది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సుదీర్ వర్మ స్క్రీన్ ప్లే అందిస్తుండగా, చందు మొండేటి సంభాషణలు రాయడం విశేషం. ఒక సినిమాకు ముగ్గురు యూత్ క్రేజీ డైరెక్టర్స్ పని చేయటం ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారి.

నిఖిల్ చివర్లో తన క్లాస్ లో అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి పొగరు కూడా ఎవరికి కూడా ఎవరికి ఎక్కువగా ఉండాలి అని చెప్పడం ఓ రేంజ్ లో పేలింది. కృష్ణుడు వచ్చాడు, ఇక కురుక్షేత్రం కూడా మొదలు అని బ్యాక్ గ్రౌండ్ లో డైలాగ్ చెప్పించడం ద్వారా యాక్షన్ కూడా ఇందులో కావలసినంత ఉందని చెప్పకనే చెప్పేసారు. సూన్ అన్నారు కాని రిలీజ్ డేట్ మాత్రం ఇందులో ప్రకటించలేదు. ఫిబ్రవరి 9న వచ్చే అవకాశం ఉంది కాని ఇంకా అది ఖరారు కావాల్సి ఉంది.