Begin typing your search above and press return to search.

అల్లు ఓటు శాండల్ స్టార్ కే పడిందా

By:  Tupaki Desk   |   4 April 2017 6:11 AM GMT
అల్లు ఓటు శాండల్ స్టార్ కే పడిందా
X
ఇవాళ తన కొడుకు అల్లు అయాన్ పుట్టిన రోజు కావడంతో.. అల్లు అర్జున్ ఫ్యామిలీతో గోవాలో ఎంజాయ్ చేస్తున్నాడు. మరో నాలుగు రోజుల్లో ఏప్రిల్ 8న బన్నీ పుట్టిన రోజు కూడా వచ్చేస్తోంది. ఆ రోజున వక్కంతం వంశీతో తన కొత్త సినిమాను అనౌన్స్ చేయడంతో పాటు.. పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నాడు.

ఓ వైపు డీజే షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు బన్నీ. మరోవైపు తర్వాతి మూవీపై ఇప్పటికే ఫోకస్ పెట్టేశాడు కూడా. రైటర్ వక్కంతం వంశీ తొలిసారిగా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో.. ఇప్పుడు హీరోయిన్ పై ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. కిరాక్ పార్టీ ఒక్క సినిమాతోనే కన్నడలో స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న రష్మిక మందనను.. హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారట. ఇప్పటికే ఈమెను హైద్రాబాద్ పిలిపించడం.. టెస్ట్ షూట్ చేయడం కూడా జరిగినట్లు తెలుస్తోంది. హీరో.. డైరెక్టర్ ఈమె లుక్స్ పై ఫుల్లు సంతృప్తి వ్యక్తం చేశారని.. దాదాపుగా ఈమెనే హీరోయిన్ గా ఖాయం చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ చిత్రానికి 'నా పేరు సూర్య' అనే టైటిల్ ను పరిశీలిస్తుండగా.. నా ఇల్లు ఇండియా అనేది ట్యాగ్ లైన్.

రష్మికకు తెలుగు నుంచి అవకాశాలు ఎక్కువగానే వస్తుండడం విశేషం. నిర్మాతగా మారిన నాగశౌర్య కూడా తనే హీరోగా నిర్మిస్తున్న చిత్రంలో రష్మికనే తేవాలని చూస్తున్నాడు. ప్రభాస్-సుజిత్ సినిమాకి కోసం రష్మిక మందనను అడిగారనే టాక్ ఉంది. ఈ కన్నడ భామ తెలుగులో వెలుగులు విరజిమ్మేట్లుగానే ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/