Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ విన్నర్ గురించి చెప్పేశాడు

By:  Tupaki Desk   |   5 July 2018 11:32 AM IST
బిగ్ బాస్ విన్నర్ గురించి చెప్పేశాడు
X
తెలుగు బిగ్ బాస్ షో సెకండ్ సీజన్ మంచి ఆదరణను ఆందుకుంటోంది. మొదట్లో ఏమో అనుకున్నాం గాని వరుసగా షోలో జరుగుతున్న పరిస్థితులు అలాగే నాని హోస్టింగ్ కు అభిమానులు చాలా పేరిగిపోతున్నారు. పైగా మొదట వచ్చిన విమర్శలే సినిమాకు ప్లస్ అయ్యాయి. ఎలిమినేషన్ సమయంలో హౌస్ నుంచి బయటకు వెళ్లిపోతున్న వారిని బట్టి షో ఏ విధంగా నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు.

షోకి అవసరం అనుకున్న వాళ్లని ఆడియెన్సే ఆదుకుంటున్నారు. ఇకపోతే గత వారం ఎలిమినేషన్ లో హౌస్ నుంచి వెళ్లిపోయిన దామరాజు కిరీటి ప్రస్తుత ఎపిసోడ్స్ గురించి పలురకాల కామెంట్స్ చేస్తూ షోకి మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాడు. కౌశల్ తో కిరీటి ఇచ్చిన టాస్క్ లో అతిగా ప్రవర్తించడం వల్లే ఎలిమినెట్ అయ్యాడని అందరికి తెలిసిందే. అయితే తాను కావాలని అలా చేయలేదని అందరూ తనని తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పాడు.

టాస్క్ లో భాగంగానే అక్కడి పరిస్థితిని సీరియస్ గా తీసుకున్నట్లు చెబుతూ.. కౌశల్ నాకు చాలా మంచి ఫ్రెండ్. అందులో ఎలాంటి డౌట్ లేదు. షోలో ఎవరికి తగ్గట్టు వారు ఆడుతున్నారని తెలిపాడు. ఇక చివరగా రోల్ రిడా లేదా అమిత్ బిగ్ బాస్ షోలో విన్ అవుతారని కిరీటి తెలపడం హాట్ టాపిక్ గా మారింది.