Begin typing your search above and press return to search.

స‌మ్మ‌త‌మే టీజ‌ర్ టాక్: మ‌న‌కి ఏదైనా బాల‌య్య బాబే

By:  Tupaki Desk   |   1 May 2022 6:47 AM GMT
స‌మ్మ‌త‌మే టీజ‌ర్ టాక్: మ‌న‌కి ఏదైనా బాల‌య్య బాబే
X
యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం పేరు ఇప్పుడు టాలీవుడ్ లో జోరుగా వినిపిస్తుంది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ అయ్యాడు. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో చేతిలో మూడునాలుగు సినిమాలున్నాయి. అందులో ఒక‌టి `స‌మ్మ‌త‌మే.` ఇందులో కిర‌ణ్ అబ్బ‌వ‌రంకి జోడీగా చాందిని చౌద‌రి న‌టిస్తోంది. ఈ సినిమాతో గోపీనాధ్ రెడ్డి అనే కొత్త కుర్రాడు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. తాజాగా ఈ సినిమా టీజ‌ర్ కొద్ది సేప‌టి క్రిత‌మే రిలీజ్ అయింది. ఓ సారి ఆ టీజ‌ర్ విశేషాలు చూస్తే.

రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ లా క‌నిపిస్తుంది. ప్రేమంటే తెలియ‌ని కుర్రాడు అమ్మాయి ప్రేమ‌లో ప‌డిన త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య సాగే స‌ర‌దా సంభాష‌ణ టీజ‌ర్ లో హైలైట్ అవుతుంది. ``ఐల‌వ్ యు క్రిష్ణ అని అమ్మాయి ప్ర‌పోజ్ చేయ‌గా..ఈ పెళ్లికి ముందు ప్రేమ అనేది ప‌డ‌దండి.. అందులో నేను ప‌డ‌ను. ల‌వ్వంటే ఏంటో తెలియని హీరోకి ఉన్న ఇద్ద‌రు స్నేహితుల పాత్ర‌లు ఆద్యంతం ఫ‌న్ తో నింపేసారు. అమ్మాయిని చూస్తే ఫ్యూజ్ కొట్టేసిన ఫీల్ క‌ల్గితే దాన్ని ల‌వ్ అంటారని స్నేహితుడు చెప్ప‌డం.

అదే స‌మ‌యంలో హీరో మ‌న‌సు మెచ్చిన‌ అమ్మాయితో కృష్ణ‌ స్నేహం అనే ప్ర‌యాణం మొద‌లు పెడ‌తాడు. ఆ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ద్య జరిగే సంభాష‌ణ‌లు..స‌న్నివేశాలు ఆస‌క్తిక‌రం. తాగుబోతులా ఉన్నారే అంటే? మీరు గ‌జ తాగుబోతులా ఉన్నారంటూ హీరోగారి కౌంట‌ర్...ప్ర‌తిగా నీది ఏ రిలీజియ‌న్ `డీసీ నా..మార్వెల్ నా`` అంటే అవేమి మ‌న‌కి తెలియ‌దు.

మ‌న‌కేదైనా బాల‌య్య బాబే అంటూ న‌ట‌సింహ బాల‌కృష్ణ‌పై అభిమానం చాటుకుంటాడు కృష్ణ‌. సారాంశాల్లోకి కూడా శాన్వి వ‌చ్చిందంటే మ‌న‌ది ల‌వ్వే అని కృష్ణ క‌న్పమ్ చేస్తాడు. ప్యూర్ యూత్ ఫుల్ ల‌వ్ స్టోరీ లా టీజ‌ర్ హైలైట్ అవుతుంది. టీజర్ యువ‌త‌ని ఆక‌ట్టుకోవ‌డం ఖాయం. మ‌రి సినిమా యువ‌త‌ని ఏ స్థాయిలో ఆ క‌ట్టుకుంటుందో తెలియాలంటే రిలీజ్ వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కంకణాల ప్రవీణ ఈ రొమాంటిక్ చిత్రాన్ని నిర్మించారు. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతం అందించారు.