Begin typing your search above and press return to search.

బాలయ్య అభిమానులకు వల విసురుతున్న కుర్ర హీరో

By:  Tupaki Desk   |   5 Aug 2021 2:30 PM GMT
బాలయ్య అభిమానులకు వల విసురుతున్న కుర్ర హీరో
X
కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత థియేటర్లు పునః ప్రారంభం అవ్వగా గత వారం తిమ్మరుసు మరియు ఇష్క్‌ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ సినిమాల్లో తిమ్మరుసు సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చింది. కాని వసూళ్ల విషయంలో మాత్రం నిరాశ పర్చింది. సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్లడంలో తిమ్మరుసు టీమ్‌ విఫలం అయ్యారా అంటే ఔను అనే సమాధానం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ తప్పును చేయవద్దనే ఉద్దేశ్యంతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కిరణ్‌ తెగ ప్రచారం చేస్తున్నాడు. కిరణ్‌ అబ్బవరం హీరోగా రూపొందిన ఎస్‌ ఆర్‌ కళ్యాణ మండపం సినిమా ను రేపు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. సినిమా ను జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతి మీడియా లో కూడా సందడి చేయడంతో పాటు ప్రతి చోట కూడా వీరి సినిమా హడావుడి కనిపించేలా ప్లాన్‌ చేశారు. ఇటీవల మెట్రో ట్రైన్ లో వీరు చేసిన సందడి అంతా ఇంతా కాదు.

ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో కిరణ్ మాట్లాడుతూ బాలయ్య అభిమానులను ఆకర్షించే ప్రయత్నం చేశాడు. చిన్నప్పుడు నాన్న టీవీ తీసుకు వచ్చిన సమయంలో మా ఇంట్లో అన్ని కూడా బాలకృష్ణ గారి సినిమాల డీవీడీలు ఉండేవి. అలా నేను మొదటగా సమరసింహారెడ్డి మరియు నరసింహ నాయుడు సినిమాలను చూశాను అన్నాడు. అందుకే నా సినిమాలో బాలకృష్ణ గారి సినిమా పోస్టర్‌ లు కనిపిస్తాయని అన్నాడు. బాలకృష్ణ అంటే మా నాన్నకు విపరీతమైన అభిమానం అని.. ఆయన ప్రతి సినిమాను చూసేవాడు అంటూ కిరణ్‌ చెప్పుకొచ్చాడు. బాలకృష్ణ అభిమానులు ప్రస్తుతం కిరణ్‌ వ్యాఖ్యలను సోషల్‌ మీడియాలో తెగ షేర్‌ చేస్తున్నారు.

బాలయ్య అభిమాని అని చెప్పుకోవడం ద్వారా ఆయన అభిమానులను ఆకర్షించిన కిరణ్‌ కావాల్సినంత మైలేజ్ ను ఎస్‌ ఆర్‌ కళ్యాణ మండపం సినిమాకు దక్కించుకున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమా లో హీరోయిన్‌ గా ప్రియాంక జవాల్కర్‌ నటించింది. గత వారం విడుదల అయిన తిమ్మరుసు సినిమా లో కూడా ఈమె నటించింది. ఆ సినిమా కమర్షియల్‌ గా నిరాశ పర్చడంతో ప్రస్తుతం ఈ అమ్మడు ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకుంది. మరి ఎస్‌ ఆర్‌ కళ్యాణ మండపం సినిమా ఎలా ఉంటుంది ఆమెకు లైఫ్‌ వస్తుందా అనేది చూడాలి. ఇక హీరోగా కిరణ్‌ అబ్బవరం కు కూడా ఈ సినిమా కమర్షియల్‌ సక్సెస్‌ దక్కించుకోవడం చాలా అవసరం.