Begin typing your search above and press return to search.

టీజ‌ర్: యావ‌రేజ్ అమ్మాయి విలువ క‌రువులో ఉన్నోడికే తెలిసేది!

By:  Tupaki Desk   |   10 July 2022 6:04 AM GMT
టీజ‌ర్: యావ‌రేజ్ అమ్మాయి విలువ క‌రువులో ఉన్నోడికే తెలిసేది!
X
ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ నెమ్మ‌దిగా త‌న స్థానం ప‌దిలం చేసుకుంటున్నాడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం. ఫ్లాప్ వ‌చ్చినా త‌డ‌బడినా  దానినుంచి రిక‌వరీ ఎలా అన్న‌ది ఈ యంగ్ హీరోకి బాగానే తెలిసిన‌ట్టే ఉంది. అత‌డు ఈసారి మాంచి ఎంట‌ర్ టైన‌ర్ తో ట్రాక్ లో ప‌డాల‌నుకుంటున్నాడు. గతాన్ని వ‌దిలి వ‌ర్త‌మానంలో మ‌న‌సు పెట్టి ప‌ని చేస్తే ఎలా ఉంటుందో తాజాగా విడుద‌లైన టీజ‌ర్ చెబుతోంది.

`నేను మీకు బాగా కావాల్సిన వాడిని` అంటూ ఈసారి తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. అత‌డు న‌టించిన నేను మీకు బాగా కావాల్సిన వాడిని తాజా టీజ‌ర్ ఆద్యంతం పుష్క‌ల‌మైన ఎంట‌ర్ టైన్ మెంట్ తో  ఆక‌ట్టుకుంది. య‌థావిధిగా కిర‌ణ్ అబ్బ‌వ‌రం బాడీ లాంగ్వేజ్ కి త‌గ్గ‌ట్టే హాస్యం సెటైర్ తో కూడుకున్న డైలాగులు ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ మూవీలో ఫ‌న్ .. చ‌తుర‌త‌.. పెర్ఫామెన్సెస్ తో పాటు మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ ప్ర‌ధాన అస్సెట్ గా క‌నిపించ‌నున్నాయి. ముఖ్యంగా బాబా భాస్క‌ర్ తో కిర‌ణ్ కాంబినేష‌న్ సీన్స్ పెద్దగానే వ‌ర్క‌వుట్ అయ్యాయ‌ని టీజ‌ర్ తో అర్థ‌మ‌వుతోంది. పంచ్ ల‌తో పాటు ఎన‌ర్జిటిక్ యాక్ష‌న్ తోనూ ఈ సినిమాలో మాస్ ని మెప్పించే ప్ర‌య‌త్నం చేసాడు కిర‌ణ్. ముఖ్యంగా అత‌డి తిరుప‌తి యాక్సెంట్ బోలెడంత ఫ‌న్ ని పండిస్తోంది. ``యావ‌రేజ్ గా ఉన్న అమ్మాయిల విలువ నాలా  క‌రువులో ఉన్నోడికి తెలుస్తుంది కానీ.. నీలా క‌డుపు నిండినోడికి ఏం తెలుస్తుంది? .``. లాంటి పంచ్ డైలాగ్ ల‌కు ఈ మూవీలో కొద‌వ‌లేదు.

కిర‌ణ్ అబ్బ‌వ‌రం- సంజ‌న ఆనంద్‌- సిధ్ధార్ద్ మీన‌న్‌- ఎస్వి కృష్ణారెడ్డి- బాబా బాస్క‌ర్‌- స‌మీర్‌- సంగీత‌- నిహ‌రిక‌- ప్ర‌మోదిని త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు.. కోడి రామ‌కృష్ణ స‌మ‌ర్ప‌ణ‌లో కోడి దివ్య ఎంట‌ర్ టైన్ మెంట్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. భాస్క‌ర్ భ‌ట్ల లిరిక్స్ ని అందిస్తున్నారు. ఇప్ప‌టికే మూవీ టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. రాజావారు రాణిగారు- ఎస్ ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్ష‌కుల ‌హృద‌యాల్లో నిలిచిన కిర‌ణ్ ఈ సినిమాతో మ‌రోసారి త‌నదైన మార్క్ వేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. లెజెండ్ కోడి రామ‌కృష్ణ తెర‌కెక్కించిన ఎంట‌ర్ టైన‌ర్స్ స్ఫూర్తితో తెర‌కెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి మ్యాజిక్ చేయ‌నుందో వేచి కూడాలి.