Begin typing your search above and press return to search.

సమ్మతమే సెన్సార్ ఫినిష్.. హిట్టయ్యేనా?

By:  Tupaki Desk   |   21 Jun 2022 9:46 AM GMT
సమ్మతమే సెన్సార్ ఫినిష్.. హిట్టయ్యేనా?
X
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మొదటినుంచి కూడా డిఫరెంట్ గా ఆడియెన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న కిరణ్ ఇటీవల నటించిన సమ్మతమే సినిమా ఈ నెల 24న విడుదల కాబోతోంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించారు.

ఇక తెలుగమ్మాయి చాందిని చౌదరి మేయిన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాపై ఓ వర్గం ఆడియెన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సాంగ్స్ తో మంచి హైప్ క్రియేట్ చేశారు. దానికి తోడు హీరో కిరణ్ అబ్బవరం కూడా జనాల్లోకి వెళ్లి సినిమాను చాలా సందడిగా ప్రమోట్ చేస్తున్నాడు.


ఇక ఈ సినిమాపై ఈ వారం కొంత హైప్ తో విడుదలవుతోంది. స్కా రీసెంట్ గా సెన్సార్ పనులను ముగించుకున్న సమ్మతమే సినిమాకు U/A సర్టిఫికెట్ లబించింది.

సమ్మతమే సినిమాను రెగ్యులర్ లవ్ స్టోరీగా కాకుండా ఆల్ డిఫరెంట్ క్యూట్ సైకో లవ్ యాంగిల్ లా చూపించబోతున్నారట. రాజవారు రాణిగారు, ఎస్ఆర్.కళ్యాణమండపం సినిమాలతో పరవాలేదు అనే విధంగా సక్సెస్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఆ తరువాత సెబాస్టియన్ సినిమాతో మాత్రం డిజాస్టర్ అందుకోవాల్సి వచ్చింది.

ఇక ఇప్పుడు సమ్మతమే సినిమా అతనికి చాలా ముఖ్యమైన సినిమా. అతను మాత్రం ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే మధ్యలో కొన్ని ఓటీటీ ఆఫర్స్ వచ్చినా కూడా ఓకే చేయలేదు.

ఇక ఆడియెన్స్ అయితే పక్కా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అంటే గాని థియేటర్స్ కు రావడం లేదు. ఇటీవల కొన్ని పెద్ద సినిమాలే దారుణంగా చతికిల పడ్డాయి. ఇక హడావుడిగా వచ్చిన కొన్ని మిడియం రేంజ్ సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. ఇక ఇప్పుడు సమ్మతమే సినిమాకు జస్ట్ నార్మల్ టాక్ వస్తే సరిపోదు. మినిమామ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అంటేనే ఆడియెన్స్ థియేటర్స్ వరకు రాగలరు. మరి సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.