Begin typing your search above and press return to search.

'సమ్మతమే' ఫస్ట్ లుక్ విడుదల..!

By:  Tupaki Desk   |   15 July 2021 10:30 AM GMT
సమ్మతమే ఫస్ట్ లుక్ విడుదల..!
X
'రాజావారు రాణిగారు' సినిమాతో హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం.. 'SR కళ్యాణమండపం' అనే చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేశాడు. ఇదే క్రమంలో 'సెబాస్టియన్' అనే సినిమా షూటింగ్ పూర్తి చేసిన యువ హీరో.. "సమ్మతమే" అనే మరో సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇందులో కిరణ్ సరసన 'కలర్ ఫోటో' ఫేమ్ చాందిని చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ కు గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్‌ కు మంచి స్పందన లభించింది.

ఈ రోజు హీరో కిరణ్ అబ్బవరం పుట్టినరోజు సందర్భంగా విషెస్ అందిస్తూ మేకర్స్ ''సమ్మతమే'' ఫస్ట్ లుక్ పోస్టర్‌ ను ఆవిష్కరించారు. ఈ పోస్టర్ లో గ్రామీణ యువకుడి గెటప్‌ లో లుంగీ కట్టుకొని ఉన్న కిరణ్‌.. ఇంటి వరండాలో కూర్చొని అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటూ మురిసిపోతున్నాడు. చాందిని చౌదరి అతన్ని ఆప్యాయంగా చూస్తూ ఉంది. ఇందులో కిరణ్ గడ్డంతో హ్యాండ్సమ్ గా కనిపిస్తుండగా.. చాందిని బ్లూ కలర్ చీరలో అందంగా కనిపిస్తుంది.

'సమ్మతమే' చిత్రానికి సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. శేఖర్ చంద్ర సంగీతం సమకూరుస్తున్నారు. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె. ప్రవీణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 80% షూటింగ్ కంప్లీట్ అయిందని మేకర్స్ వెల్లడించారు. ఇకపోతే కిరణ్ అబ్బవరం - ప్రియాంక జవాల్కర్ జంటగా నటించిన 'SR కళ్యాణమండపం' సినిమా ఆగస్టు 6న థియేటర్లలో విడుదల కానుంది. శ్రీధర్ గాదె దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రమోద్ - రాజు నిర్మించారు.