Begin typing your search above and press return to search.

ఆసక్తికరంగా మెగా అల్లుడి 'కిన్నెరసాని' టీజర్..!

By:  Tupaki Desk   |   27 Aug 2021 12:30 PM GMT
ఆసక్తికరంగా మెగా అల్లుడి కిన్నెరసాని టీజర్..!
X
మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''కిన్నెరసాని''. మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి 'అతి స‌ర్వ‌త్ర వ‌ర్జ‌య‌త్' అనేది ఉప శీర్షిక. 'అశ్వథ్థామ' ఫేమ్ రమణ తేజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - ఫస్ట్ గ్లిమ్స్ - 'థీమ్ ఆఫ్ కిన్నెరసాని' సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

'మీ పాప ఓ అద్భుతం.. కానీ అద్భుతం జరిగే ప్రతీ చోట ఆపద ఉంటుంది' అని ఓ అమ్మాయి చెప్పే డైలాగ్ తో ఈ టీజర్ ప్రారంభమైంది. సముద్ర తీరాన ఓ జంట గొడుగు పట్టుకొని కనిపించడం.. కళ్యాణ్ దేవ్ తీక్షణంగా చూస్తూ ఉండటం.. రోడ్డు మీద ఓ కారు ఆక్సిడెంట్.. కాగడలు పట్టుకొని జనం వెళ్తుండటం.. కిన్నెరసాని అనే పుస్తకం.. ఫైట్ సీన్ వంటి అంశాలను చూపిస్తూ ఇంట్రెస్టింగ్ గా ఈ టీజర్ ని కట్ చేశారు.

'ఈ ప్రపంచంలో ప్రతీ దానికి ఓలిమిట్ ఉండాలి.. అది ద్వేషానికైనా.. చివరకు ప్రేమకైనా' అనే డైలాగ్ ఆలోచిపజేసేలా ఉంది. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ మ‌హ‌తి స్వర సాగ‌ర్ అందించిన నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. కెమెరామెన్ దినేష్ కె బాబు విజువల్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రానికి దేశరాజ్ సాయితేజ్ కథ - స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. కిట్టు విస్సాప్రగడ సాహిత్యం రాస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటింగ్ చేస్తుండగా.. అన్బు అరీవ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

'కిన్నెరసాని' సినిమా తండ్రి కోసం అన్వేషణ సాగించిన ఓ యువకుడి కథ అని తెలుస్తోంది. ఇందులో వేద అనే పాత్రలో కళ్యాణ్ దేవ్ కనిపించనున్నాడు. రవీంద్ర విజయ్ - ఆన్ శీతల్ - మహతి బిక్షు - కాశిష్ ఖాన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. సాయి రిషిక సమర్పణలో ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ - శుభమ్ ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రామ్ త‌ళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. విభిన్నమైన కథ కథనాలతో వస్తున్న 'కిన్నెరసాని' కళ్యాణ్ దేవ్ కి ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడుతుందో చూడాలి.