Begin typing your search above and press return to search.
కింగ్ నాగార్జున నెవ్వర్ బిఫోర్ అవతార్ లుక్
By: Tupaki Desk | 8 Aug 2021 1:27 PM ISTకింగ్ నాగార్జున నటించిన `వైల్డ్ డాగ్` మంచి సమీక్షలు అందుకుని కరోనా క్రైసిస్ వల్ల ఫ్లాపైన సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నాగార్జున ఎన్.ఎస్.జి కమెండో పాత్రలో అదరగొట్టారన్న ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాతా ఆయన ప్రయోగాల బాటను విడవలేదు. తనకు కెరీర్ లో ఎంతో పేరు తెచ్చినవి ప్రయోగాలే. అందుకే ఆయన సాహసాల బాటను విడిచేందుకు సిద్ధంగా లేరు.
ప్రస్తుతం జాతీయ అవార్డ్ ఫిలింమేకర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రం భారీ యాక్షన్ ఎంటర్ టైనర్. హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో రక్తి కట్టించనుంది. నాగ్ ని మునుపెన్నడూ చూడని సరికొత్త అవతార్ లో చూడనున్నారు అభిమానులు. తాజాగా సెట్స్ నుంచి నాగార్జున ఫోటోలు సోషల్ మీడియాల్లో విడుదలయ్యాయి. మేకర్స్ ఈ ఏడాది చివరినాటికి షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేసారు. కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కొంత గ్యాప్ తర్వాత తిరిగి ప్రారంభమైంది
నాగార్జునతో కాజల్ సినిమాలో నటించడం ఇదే మొదటిసారి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కాజల్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నా పాత్ర ఖచ్చితంగా నా కెరీర్ లో అత్యంత ప్రత్యేకమైనదిగా ఉంటుంది. షూటింగ్ లో పాల్గొనేందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నా చిన్నతనం నుండి నాగార్జునపై నాకు విపరీతమైన అభిమానం ఉంది కాబట్టి నాకు ఈ అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్రాన్ని నిర్మాతలు నారాయణ్ దాస్ నారంగ్- రామ్ మోహన్ రావు -శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం కింగ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో `సోగ్గాడే చిన్ని నాయనా` (2016) సీక్వెల్ లో నాగార్జున నటిస్తున్న సంగతి తెలిసినదే. ఈ చిత్రంలో రమ్యకృష్ణ తన పాత్రకు కొనసాగింపు పార్ట్ ని చేయడానికి సిద్ధమవుతున్నారు. కాజల్ ప్రస్తుతం `ఉమా` చిత్రీకరణ కోసం కోల్ కతాలో ఉన్నారు. అక్కడ సుదీర్ఘ షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. నాగార్జున సినిమా సెట్స్ లో ఎప్పుడు జాయిన్ అవుతుందో చూడాలి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.