Begin typing your search above and press return to search.
మహేష్ - పవన్ లతో పోటీకి దిగుతానంటున్న 'కింగ్' నాగ్..!
By: Tupaki Desk | 1 March 2021 11:00 PM IST'కింగ్' అక్కినేని నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘బంగార్రాజు’గా నాగ్ అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్నారు. దీంతో అదే పాత్రని బేస్ చేసుకొని సీక్వెల్ సినిమాను తెరకెక్కించాలని నాగార్జున అండ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ డిసైడ్ అయ్యారు. దీని కోసం ''బంగార్రాజు'' అనే టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఈ సీక్వెల్ రాబోతోందని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఇంతవరకు సెట్స్ పైకి వెళ్ళలేదు. దీంతో అసలు ఈ సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా నాగార్జున 'బంగార్రాజు' సినిమా గురించి మాట్లాడుతూ అప్పుడే రిలీజ్ పై కూడా క్లారిటీ ఇచ్చేశాడు.
నేడు 'వైల్డ్ డాగ్' సినిమా విడుదల తేదీని ప్రకటించిన నేపథ్యంలో నాగార్జున మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా 'బంగార్రాజు' విశేషాలు వెల్లడిస్తూ ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.. రాబోయే జూన్ లేదా జులై నెలలో షూటింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా అన్నీ అనుకున్నట్లు జరిగితే 2022 సంక్రాంతికి 'బంగార్రాజు' చిత్రాన్ని రిలీజ్ చేస్తామని నాగ్ ప్రకటించారు. 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలిచి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే వచ్చే సంక్రాంతి బెర్త్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కర్చీఫ్ వేశారు. 'సర్కారు వారి పాట' మరియు #PSPK27 సినిమాలు ఫెస్టివల్ సీజన్ లో రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు నాగ్ కూడా పవన్ - మహేష్ పోటీగా బరిలో దిగాలనుకుంటున్నాడు. మరి రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి.