Begin typing your search above and press return to search.
కింగ్ నాగ్ స్పెషల్ ట్రైనింగ్.. అందుకేనట!
By: Tupaki Desk | 15 Jun 2021 12:00 PM ISTతెలుగు చిత్రపరిశ్రమలో ఎల్లప్పుడూ కొత్తదనంతో పాటు ప్రయోగాత్మక సినిమాలు చేసే హీరోలలో కింగ్ నాగార్జున ఎల్లప్పుడూ ముందే ఉంటాడు. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి సీనియర్ హ్యాండ్సమ్ హీరో నాగ్ ఫస్ట్ అనే చెప్పాలి. ఇటీవలే వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన నాగ్.. ప్రస్తుతం భారీ యాక్షన్ సినిమాతో అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు. పిఎస్‌వి గరుడవేగ మూవీతో స్టైలిష్ మేకర్ గా టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. ఆ సినిమాతో తనలోని మరో యాంగిల్ బయటికి తీసాడు సక్సెస్ అందుకున్నాడు.
ప్రస్తుతం ప్రవీణ్ సినిమాలో పరిగెత్తడానికి కింగ్ నాగ్ రెడీ అవుతున్నాడు. ఇప్పటికే నాగార్జునను ఈ సినిమాలో చాలా స్టైలిష్ గా చూపెందుకు క్యారెక్టర్ డిజైన్ చేసాడట. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ మూవీ పై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. అలాగే ఇప్పుడు సినిమాకు సంబంధించి కొన్ని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఆల్రెడీ షూట్ ప్రారంభించి నాగ్ - ప్రవీణ్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లారు. కానీ కరోనా కారణంగా బ్రేక్ పడింది. త్వరలోనే షూట్ రీస్టార్ట్ చేసెందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈసారి నాగ్ తో హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ సినిమాలో నాగ్ ఎక్స్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్.
ప్రస్తుతం ఆ పాత్రకోసం నాగ్ చాలా మేకోవర్ అయ్యాడట. అయితే తాజాగా ఈ సినిమా గురించి మరో వార్త హల్చల్ చేస్తోంది. ఈ సినిమా గురించి నాగ్ ఇజ్రాయెల్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడని టాక్. క్రావ్ మాగా - కత్తిసాము లాంటివి కూడా ట్రై చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ యాక్షన్ సీన్స్ అన్నికూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండబోతున్నాయని సినీవర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ కాగా.. అనిఖా సురేంద్రన్ కీలకపాత్రలో కనిపించనున్నట్లు టాక్. ఈ హై వోల్టెజ్ యాక్షన్ సినిమాను నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు, శరత్ మరార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.