Begin typing your search above and press return to search.
'రణబీర్-అలియా' లపై ప్రశంసలు కురిపించిన కింగ్ నాగ్!
By: Tupaki Desk | 16 Feb 2021 6:00 PM ISTటాలీవుడ్ కింగ్ నాగార్జున బ్రహ్మాస్త్రా మూవీతో త్వరలో బాలీవుడ్‌కు అడుగుపెడుతున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో నాగార్జున తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సందర్బంగా తాజాగా నాగార్జున బ్రహ్మస్త్ర హీరోహీరోయిన్ల పై ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమాలో స్టార్ హీరో రన్బీర్ కపూర్, అలియా భట్ నాయకనాయికలుగా నటిస్తున్నారు. అయితే వీరిద్దరినీ కింగ్ నాగ్ స్టార్లెట్ పెర్ఫార్మర్స్ అంటూ ప్రశంసించాడు. ప్రస్తుతం నాగ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఫాంటసీ సినిమాగా రూపొందుతున్న బ్రహ్మస్త్రకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. బ్రహ్మస్త్ర అనే అత్యంత శక్తివంతమైన ఒక ఆయుధం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని.. అందులో నాగ్ ఓ పురావస్తు శాస్త్రవేత్తగా కనిపిస్తాడని సమాచారం.
ఇక ఒక ఫేమస్ పురాతన ఆలయాన్ని పునరుద్ధరించడానికి వచ్చిన పురావస్తు శాస్త్రవేత్త నాగార్జున తన విద్యార్థులతో కలిసి గంగా ఒడ్డున యాత్రకు వెళ్లడమే ఈ సినిమా మెయిన్ థీమ్ అని తెలుస్తుంది. ఇందులో రణబీర్ శివ పాత్రలో కనిపిస్తాడట. శివ క్యారెక్టర్ తో చేతిలో నుండి మంటలు కూడా రప్పించగలడట. ఇక అలియా భట్ శివ మీద మనసుపడే ఇషా పాత్రలో నటిస్తోంది. అయితే తాజా నివేదికల ప్రకారం.. ఈ సినిమాలో సైంటిస్ట్ నాగార్జున రణబీర్, అలియాలను యాత్రకు తీసుకెళ్తుండగా మధ్యలో పురాతన నగరమైన కాశీలో కథ నడుస్తుందని టాక్. నాగ్ క్యారెక్టర్ చాలా కీలకంగా ఉండబోతుందని అర్ధమవుతుంది. ఇక విలన్స్ గా మౌనిరాయ్, సౌరవ్ గుర్జర్ కనిపించనున్నారు. ఇదిలా ఉండగా రణబీర్, అయాన్ కాంబినేషన్ లో ఇదివరకే వేకప్ సిద్, యే జవాని హై దీవాని సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఈ సినిమాతో హ్యాట్రిక్ పై కన్నేసారట. చూడాలి మరి బ్రహ్మస్త్ర ఎలా ఉండబోతుందో!