Begin typing your search above and press return to search.

'కింగ్' నాగ్ కొత్త చిత్రం ప్రారంభం..!

By:  Tupaki Desk   |   16 Feb 2021 4:00 PM IST
కింగ్ నాగ్ కొత్త చిత్రం ప్రారంభం..!
X
'కింగ్' అక్కినేని నాగార్జున - 'PSV గరుడవేగ' ఫేమ్ ప్రవీణ్‌ సత్తారు కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ మరియు నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్మెంట్‌ ప్రై.లి బ్యానర్స్‌ పై నారాయణదాస్ కె నారంగ్ - రామ్మోహనరావు - శరత్ మరార్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాను మంగళవారం సికింద్రాబాద్ లోని గణపతి దేవాలయంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ క్లాప్ ఇచ్చి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇప్పటికే 'వైల్డ్ డాగ్' సినిమాతో పాటు 'బ్రహ్మాస్త్ర' అనే పాన్ ఇండియా మూవీలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేసుకున్న నాగార్జున.. ఇప్పుడు ప్రవీణ్‌ సత్తారుతో కలిసి ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ లో నటించనున్నాడు. తన కొత్త సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ''నిన్ననే బ్రహ్మాస్త్ర‌ షూటింగ్ పూర్తి చేసుకుని వ‌చ్చాను. ఈ రోజు శ్రీ గ‌ణ‌ప‌తి దేవాల‌యంలో నా సినిమా ప్రారంభించ‌డం సంతోషంగా ఉంది. టైటిల్ ఇంకా ఫైన‌లైజ్ అవ్వ‌లేదు. యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ లో ఇలాంటి ఒక ప‌వ‌ర్‌ ఫుల్ క్యారెక్ట‌ర్‌ లో న‌టించి చాలా రోజులైంది. లండ‌న్‌ - ఊటీ - గోవా - హైద‌రాబాద్‌ లలో షూటింగ్ జరగనుంది'' అని తెలిపారు.