Begin typing your search above and press return to search.

కింగ్ నాగ్ లేటెస్ట్ మూవీ షూటింగ్ అప్డేట్..!

By:  Tupaki Desk   |   2 Aug 2021 6:00 PM IST
కింగ్ నాగ్ లేటెస్ట్ మూవీ షూటింగ్ అప్డేట్..!
X
కింగ్ అక్కినేని నాగార్జున - 'PSV గరుడవేగ' డైరెక్టర్ ప్రవీణ్‌ సత్తారు కాంబినేషన్ లో ఓ హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌ గా న‌టిస్తోంది. ఇది నాగ్ - కాజల్ కాంబోలో వస్తున్న ఫస్ట్ సినిమా. ఇందులో గుల్ ప‌నాంగ్‌ - అనైకా సురేంద్ర‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇప్పటికే గోవా లో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ఈ క్రమంలో సెకండ్ షెడ్యూల్ ను మొదలు పెట్టడానికి చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

హైదరాబాద్ లో ఈ బుధవారం(ఆగ‌స్ట్ 4) నుంచి రెండో షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభం కానుందని మేకర్స్ వెల్లడించారు. ఇండియాలోని ప్ర‌ధాన న‌గ‌రాలు మరియు విదేశాలలో ఈ సినిమాలోని కీల‌క‌మైన స‌న్నివేశాల‌ షూట్ ను ప్లాన్ చేస్తున్నారు. నాగార్జున ఈ చిత్రంలో ఎంటర్టైనింగ్ అండ్ యాక్షన్ ప్యాక్డ్ రోల్‌ లో కనిపిస్తారని తెలుస్తోంది. అలానే హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఇంతముందు చేయని పాత్ర పోషిస్తోందని టాక్.

కాగా, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్ఎల్‌పి మరియు నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్మెంట్‌ ప్రై.లి బ్యానర్స్‌ పై ఈ సినిమా రూపొందుతోంది. నారాయ‌ణ్ దాస్ కె నారంగ్ - పుష్కర్ రామ్మోహనరావు - శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముఖేష్.జి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తుండగా.. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్‌ గా వ్యవహరిస్తున్నారు. రాబిన్ సుబ్బు మరియు నభా మాస్టర్ కలిసి యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

ఇకపోతే ఈ ఏడాది 'వైల్డ్ డాగ్' సినిమాతో మెప్పించిన నాగార్జున.. ''బంగార్రాజు'' చిత్రాన్ని కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఆగస్టు 20న హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈ షూటింగ్ మొదలు కానుందని వార్తలు వస్తున్నాయి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో యువసామ్రాట్ నాగచైతన్య కూడా నటించనున్నారు. ఆగస్ట్ 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ప్రస్తుతం ఆయన నటించే సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.