Begin typing your search above and press return to search.
కింగ్ మెచ్చిన కాన్సెప్ట్.. ఆ హాలీవుడ్ మూవీ స్ఫూర్తి!?
By: Tupaki Desk | 20 Sept 2020 12:00 PM ISTఏజ్ కి స్టామినాకి తగ్గ కథాంశాల్ని ఎంచుకుంటే మాత్రమే ఇప్పుడున్న వెటరన్ హీరోలకు పనవుతుంది. పరిమితి దాటిన వయసుతో సంబంధమే లేకుండా ఇంకా ప్రేమ సన్నివేశాలు.. చెట్టు పుట్ట అంటూ సాంగేసుకునే సినిమాలు చేస్తామంటే అంగీకరించేందుకు టాలీవుడ్ ఆడియెన్ సిద్ధంగా లేరు. ఆ సంగతిని ఇప్పటికే పలు వైఫల్యాలు నిరూపించాయి. అందుకు తగ్గట్టే మన సీనియర్ హీరోలు ప్లాన్ మార్చుకుని నవ్యపంథా కథల్ని ఎంచుకుంటున్నారు.
ప్రస్తుతం కింగ్ నాగార్జున కరెక్షన్ కి వచ్చినట్టే కనిపిస్తోంది. ఆయన కొన్ని వరుస ఫ్లాప్ లు ఎదుర్కొన్నాక ఇప్పుడు ఎంతో జాగ్రత్తగా స్క్రిప్టుల్ని ఎంచుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కింగ్ మనసు వరుసగా స్పై యాక్షన్ థ్రిల్లర్ తరహా కథాంశాలపై పడిందట. ఇటీవల జాతీయ అవార్డు మూవీ కర్త అయిన ప్రవీణ్ సత్తారు వినిపించిన కథాంశం ఈ తరహానే.
ఒక రైతు తప్పిపోయిన తన కూతురిని వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో ఎదురైన సంఘటనల సమాహారంగా సినిమా ఉంటుందట. యాక్షన్ ఎపిసోడ్స్ థ్రిల్లర్ మోడ్ లో ఆద్యంతం రక్తి కట్టిస్తాయని చెబుతున్నారు. నిజానికి ఈ కథ వినగానే హాలీవుడ్ బ్లాక్ బస్టర్ `టేకెన్` గుర్తుకు వస్తుంది. అక్కడ కూడా ఇంటర్నేషనల్ మాఫియా సెక్స్ రాకెట్ నేపథ్యంలో సాగుతుంది. తప్పిపోయిన తన కూతురిని వెతుక్కుంటూ వెళ్లే తండ్రి కథ అది. ప్రతి సీన్ రక్తి కట్టించేలా తెరకెక్కించిన ఈ చిత్రం హాలీవుడ్ లో సంచలన విజయం సాధించింది. అయితే దీనిని తెలుగు ఆడియెన్ కి ఎక్కేలా రైతు నేపథ్యానికి మార్చారా? మన నేటివిటీని ప్రతిఫలించే ప్రయత్నం చేస్తున్నారా? అన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి. అయితే ఇప్పటివరకూ కథాంశం ఇదీ అంటూ నాగ్ కానీ.. ప్రవీణ్ సత్తారు కానీ లీకులివ్వలేదు. అంతవరకూ ఇది కేవలం ఫిలింనగర్ గుసగుస మాత్రమే.
యాంగ్రీ హీరో రాజశేఖర్ కి గరుడవేగ లాంటి స్క్రిప్టుతో బంపర్ హిట్టిచ్చిన ప్రవీణ్ సత్తారు మరో ఛాలెంజింగ్ మూవీతో నాగ్ కి బ్లాక్ బస్టర్ ఇస్తాడేమో చూడాలి. నాగార్జున నటిస్తున్న వైల్డ్ డాగ్ త్వరలో విడుదల కానుంది. ఇందులో అతడు ఎన్.ఐ.ఏ అధికారిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తదుపరి ప్రవీణ్ సత్తారు సినిమాని ప్రారంభించనున్నారు.