Begin typing your search above and press return to search.

రియ‌ల్ సినిమాని త‌ల‌పించే కింగ్ ఖాన్ ల‌వ్ స్టోరి

By:  Tupaki Desk   |   3 Nov 2021 3:05 AM GMT
రియ‌ల్ సినిమాని త‌ల‌పించే కింగ్ ఖాన్ ల‌వ్ స్టోరి
X
కింగ్ ఖాన్ షారూక్ - గౌరీఖాన్ ప్రేమ వివాహం రియ‌ల్ సినిమానే త‌ల‌పిస్తుంది అంటే అతిశ‌యోక్తి కాదు. నిజానికి ఆ ఇద్ద‌రూ స్కూల్ డేస్ నుంచి స్నేహితులు. షారూక్ స్టార్ గా ఎదిగాక ప్ర‌పోజ్ చేస్తే అందుకు గౌరీ ఖాన్ త‌ల్లిదండ్రులు అస్స‌లు అంగీక‌రించ‌లేదు. అత‌డు న‌టుడు కావ‌డ‌మే అన‌ర్హ‌త అని గౌరీ తండ్రి భావించార‌ట‌. గౌరీఖాన్ త‌ల్లికి షారూక్ అంటే స‌సేమిరా ఇష్టం లేద‌ట‌.

అయితే షారూక్ ఖాన్ ప్రేమ‌క‌థ తెలిసాక త‌న తండ్రిగారు వెళ్లి గౌరీఖాన్ త‌ల్లిదండ్రుల‌తో మాట్లాడి ఒప్పించారు. ఆ త‌ర్వాతే ఈ జంట పెళ్లి జ‌రిగింది. ఆస‌క్తిక‌రంగా త‌న బావ‌మ‌రిది గ‌న్ గురి పెట్టి త‌న‌ని చంపేస్తాన‌ని కూడా బెదిరించినా కింగ్ ఖాన్ ఏమాత్రం అద‌ర‌క బెద‌ర‌క ల‌వ్ స్టోరీని కంటిన్యూ చేశాడు. బావ‌మ‌రిది పెద్ద గూండా రాజ్ అని తెలిసి కూడా ఖాన్ ధైర్యంగా ప్రేమ‌ను ద‌క్కించుకున్నాడు. ఆ ఇద్ద‌రూ విడిపోవాల‌నేంత కోపంతో గౌరీఖాన్ త‌ల్లి గారు ప‌లువురు జ్యోతిష్యుల‌ను కూడా క‌లిసారంటే ఎంతటి వ్య‌తిరేక‌త నెల‌కొందో అర్థం చేసుకోవాలి.

నేడు కింగ్ ఖాన్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా మ‌రోసారి బాలీవుడ్ మీడియాలో ఖాన్ ప్రేమాయ‌ణం హైలైట్ గా మారింది. దీపావ‌ళి సంద‌ర్భంగా షారూక్ మ‌న్న‌త్ దివ్వెల‌తో వెలిగిపోతోంది. ఈసారి ఆర్య‌న్ అరెస్ట్ వ్య‌వ‌హారం తో కింగ్ ఖాన్ బ‌ర్త్ డేని మ‌మ అనిపించేశారు. ఖాన్ కి బ‌ర్త్ డే విషెస్ తెలిపేందుకు మ‌న్న‌త్ బ‌య‌ట చాలామంది అభిమానులు వేచి చూసినా పోలీస్ సిబ్బంది వారిని ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌లేదు.

సినీ క్రిటిక్‌ అనుపమ చోప్రా `కింగ్‌ ఆఫ్‌ బాలీవుడ్‌` పేరుతో షారుక్‌ బయోగ్రఫీ రాసిన సంగతి తెలిసిందే. ఆ పుస్త‌కంలో షారుక్‌-గౌరీల ప్రేమ‌క‌థ‌ను రాసారు