Begin typing your search above and press return to search.

రాజు గారు.. ఇది మరో డర్టీ హరినా?

By:  Tupaki Desk   |   9 Feb 2022 11:30 AM GMT
రాజు గారు.. ఇది మరో డర్టీ హరినా?
X
తెలుగు ప్రేక్షకులకు నిర్మాతగా పలు సూపర్‌ హిట్‌ చిత్రాలను అందించాడు ఎంఎస్ రాజు. మహేష్ బాబు నటించిన ఒక్కడు మరియు వర్షం.. నీ స్నేహం.. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా ఇంకా పలు సినిమాలను రాజు గారు నిర్మించి భారీ చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్నాడు. సక్సెస్ ఫుల్‌ నిర్మాతగా దూసుకు పోతున్న సమయంలో ఆయనకు రెండు మూడు సినిమాల ప్లాప్ లు గట్టిగా పడ్డాయి. దాంతో ఆయన నిర్మాణం వదిలేశాడు. దాదాపుగా దశాబ్ద కాలం పాటు ఇండస్ట్రీలో కనిపించకుండా పోయారు.

ఆయన వారసుడిగా తనయుడు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కొడుకును ప్రోత్సహిస్తూ సినిమాలను తెర వెనుక ఉండి నడిపించే ప్రయత్నం చేశారనే ప్రచారం కూడా జరిగింది. నిర్మాతగా తనకున్న అనుభవంతో దర్శకుడిగా సినిమాలను తీసేందుకు సిద్దం అయ్యి మొదటగా వానా సినిమా ను తెరకెక్కించాడు. ఆ సినిమా నిరాశ పర్చింది. ఆ తర్వాత తూనీగ తూనీగ సినిమాను చేశాడు. ఆ సినిమా కూడా కమర్షియల్‌ గా హిట్‌ అవ్వలేదు. కాస్త గ్యాప్ తీసుకుని ఆమద్య డర్టీ హరి సినిమాను తెరకెక్కించాడు.

పూర్తిగా అడల్ట్‌ కంటెంట్ తో డర్టీ హరి సినిమాను తెరకెక్కించి ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చాడు. ఒక్కడు వంటి అద్బుతమైన సినిమాను తెరకెక్కించిన ఎంఎస్ రాజు ఇలాంటి సినిమాను తెరకెక్కించడం ఏంటీ అని అంతా అనుకున్నారు. డర్టీ హరి సినిమా కంటెంట్‌ విషయం పక్కన పెడితే అడల్ట్‌ విషయాలు ఉన్నాయి కనుక జనాలు ఆధరించినట్లుగానే అనిపించింది. ఆ మద్య తెగ చర్చ జరిగిన డర్టీ హరి తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకుని ఎంఎస్ రాజు 7 డేస్ 6 నైట్స్ అనే మరో అడల్ట్ కంటెంట్‌ సినిమాను తెరకెక్కించాడు.

నేడు సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. ట్రైలర్‌ విడుదల కాకుండానే పోస్టర్ తోనే ఆ సినిమా మరో డర్టీ హరి సినిమా మాదిరిగా ఉంటుందనే అభిప్రాయంకు ప్రేక్షకులు వచ్చారు.

ఇప్పటికే టైటిల్‌ ను చూసి యూత్‌ ఆడియన్స్ అట్రాక్ట్‌ అవుతున్నారు. ట్రైలర్ కోసం.. సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని సోషల్‌ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. కొత్త వారితో దర్శకుడు ఎంఎస్‌ రాజు తెరకెక్కించిన ఈ సినిమా ను సమ్మర్ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా ద్వారా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 16 మంది కొత్త టెక్నీషియన్స్ ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.

ఇంకా ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను అతి త్వరలోనే రాజు గారు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తాను కూడా మారి బోల్డ్ కంటెంట్‌ ను తెరకెక్కిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్న ఎంఎస్ రాజు తెరకెక్కించిన ఈ 7 డేస్ 6 నైట్స్ ఏ రేంజ్ లో యూత్‌ ను ఆకట్టుకుంటుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే మొత్తం అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది. ఫలితం ఏంటీ అనేది విడుదల అయితే కాని క్లారిటీ వచ్చే అవకాశం లేదు. నేడు ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కాబోతుంది. ట్రైలర్ లో ఏ స్థాయి రొమాన్స్ ఉంటుందో చూడాలి.